సౌతాఫ్రికా లెజెండరీ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్( Dale Steyn ) క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ట్విటర్ ద్వారా ప్రకటించాడు. 38 ఏళ్ల ఈ పేస్‌బౌలర్ క్రికెట్‌లోని వేగవంతమైన బౌలర్లలో ఒకడు. సౌతాఫ్రికా తరఫున 93 టెస్టులు ఆడిన స్టెయిన్.. 439 వికెట్లు తీశాడు. తన రిటైర్మెంటన్ ప్రకటనను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. తనకెంతో ఇష్టమైన గేమ్ నుంచి ఇవాళ రిటైరవుతున్నట్లు చెప్పాడు. 20 ఏళ్ల పాటు ట్రైనింగ్, ప్రయాణాలు, గెలుపులు, ఓటములు అంటూ తీరక లేకుండా గడిపానని, ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని తన ప్రటనలో స్టెయిన్ అన్నాడు. 2019, ఫిబ్రవరిలో చివరి టెస్ట్ ఆడిన స్టెయిన్.. అదే ఏడాది ఆగస్ట్‌లో టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. ఇక చివరి వన్డేను 2019 మార్చిలో, చివరి టీ20ని గతేడాది ఫిబ్రవరిలో ఆడాడు. గతేడాది ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు ఆడిన స్టెయిన్.. కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడలేదు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన స్టెయిన్.. 125 వన్డేల్లో 196 వికెట్లు, 47 టీ20ల్లో 64 వికెట్లు తీశాడు.
డెల్ స్టెయిన్ రిటైర్మెంట్
Related tags :