Business

రిలయన్స్ కోవిద్ టీకా పరిశోధనకు అనుమతులు మంజూరు-వాణిజ్యం

రిలయన్స్ కోవిద్ టీకా పరిశోధనకు అనుమతులు మంజూరు-వాణిజ్యం

* ‘రిలయెన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌’ దేశీయంగా తయారుచేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలిదశ క్లినికల్‌ పరీక్షలకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం అనుమతించింది. ఆరోగ్యవంతుల్లో ఈ టీకా భద్రత, రోగనిరోధక స్పందనలు ఎలా ఉన్నాయన్నది పరీక్షించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో 8 చోట్ల ఈ క్లినికల్‌ పరీక్షలు చేపడతారు. ముఖేశ్‌ అంబానీకి చెందిన రిలయెన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌… వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలకు అనుమతి కోరుతూ గతనెల 26న విషయ నిపుణుల సంఘానికి దరఖాస్తు చేసింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు.. టీకాలు అందించిన తర్వాత 14వ రోజున కాకుండా, 42వ రోజున వలంటీర్లలో రోగనిరోధక శక్తి స్థాయులను సమీక్షించాలని తయారీ సంస్థకు సూచించింది.

* వచ్చే డిసెంబరు నుంచి వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. ఇప్పుడు సాగులో ఉన్న పంటలు చేతికి రానున్న నేపథ్యంలో అప్పటికల్లా అంతర్జాతీయంగా నూనె ధరలు తగ్గుతాయని అంచనా వేశారు. ఇప్పటికే డిసెంబర్‌ ఫ్యూచర్‌ మార్కెట్‌లో వంట నూనెల రేట్లు తగ్గాయని తెలిపారు. అయితే, గిరాకీ ఇంకా భారీ స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో తగ్గింపు భారీ స్థాయిలో ఉండకపోవచ్చునని పేర్కొన్నారు.

* రెండేండ్ల క్రితం 2019లో నేల‌కు ప‌రిమిత‌మైన ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్వేస్ ఇప్ప‌ట్లో టేకాఫ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. జెట్ ఎయిర్వేస్ టేకోవ‌ర్ చేసేందుకు ముందుకు వ‌చ్చిన క‌న్సార్టియం స‌మ‌ర్పించిన రిజొల్యూష‌న్ ప్లాన్‌పై ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్బీ) అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోంది. స‌ద‌రు క‌న్సార్టియం ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకిస్తూ ఎన్సీఎల్ఏటీ ముంబై బెంచ్‌ను ఆశ్ర‌యించింది. దీనిపై ముగ్గురు స‌భ్యుల ఎన్సీఎల్ఏటీ బెంచ్ స్పందించింది.

* ఆటోమొబైల్‌.. స్మార్ట్ ఫోన్లు.. టాబ్లెట్స్‌.. ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్స్‌.. టీవీల ధ‌ర‌లు.. ప్ర‌త్యేకించి కార్ల ధ‌ర‌లు మ‌రింత పెరుగ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇన్‌పుట్ వ్య‌యం పెరిగింద‌ని దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు మూడుసార్లు త‌మ కార్ల ధ‌ర‌లు పెంచేశాయి. మ‌రోమారు ఇన్‌పుట్ వ్య‌యం వినియోగ‌దారుల‌పై ప‌డ‌బోతున్న‌ది. క‌రోనా మ‌హమ్మారి ప్ర‌భావంతో ఎల‌క్ట్రానిక్ డివైజెస్‌కు గిరాకీ ఎక్కువైంది. ఇది ఆటోమొబైల్ రంగంపై దారుణంగా ప్ర‌భావం చూపింది. మోడ్ర‌న్ కార్ల‌లోని ప‌లు వ్య‌వ‌స్థ‌లు ప‌ని చేయాలంటే చిప్స్ చాలా కీల‌కం. చిప్స్ కొర‌త పుణ్య‌మా? అని ప‌లు ఆటోమొబైల్ సంస్థ‌లు త‌మ ఉత్ప‌త్తిని తాత్కాలికంగా నిలిపేశాయి. మున్ముందు డిమాండ్‌ను అందుకోవాలంటే అధిక ధ‌ర‌ల‌కు సెమీ కండ‌క్ట‌ర్లు, చిప్‌ల‌ను సేక‌రించాల్సి రావ‌చ్చు. అదే జ‌రిగితే కార్ల కొనుగోలుదారుల‌పై మ‌రింత భారం ప‌డ‌టం ఖాయం అని తెలుస్తోంది.