రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా విజయ్ సేతుపతి నటించిన చిత్రం ‘లాభం’. తమిళ, తెలుగు భాషల్లో సెప్టెంబరు 9న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీ కట్టాలనుకునే వ్యాపారవేత్తగా జగపతిబాబు, అది జరగకుండా రైతుల పక్షాన నిలిచే వ్యక్తిగా విజయ్ సేతుపతి కనిపించారు. ఇద్దరి నటన మెప్పిస్తోంది. ‘మార్కెట్టుకి వచ్చేటప్పుడు అందులో లాభం అనేది కలుస్తుంది. అదే నిలువు దోపిడీగా మారుతుంది. అక్కడే రెండు వర్గాలుగా చీలుతుంది’ అని సేతుపతి చెప్పిన డైలాగ్ అలరిస్తోంది. ‘మీ దృష్టిలో లాభం అంటే ఏంటి?’ అంటూ సాగే సన్నివేశం ఆకట్టుకునేలా ఉంది. మరి లాభం అంటే ఏంటి? సేతుపతి రైతుల సమస్యల్ని ఎలా పరిష్కరించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రానికి ఎస్.పి. జననాథన్ దర్శకత్వం వహించారు. విజయ్‌సేతుపతి, పి. అరుముగకుమార్ నిర్మించారు. ఇమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సేతుపతి సరసన శ్రుతిహాసన్ సందడి చేయనుంది.
రైతు సమస్యలపై విజయ్ సేతుపతి సినిమా…”లాభం”
Related tags :