WorldWonders

లాటరీ పద్ధతిలో పెళ్లాడిన యువకుడు

లాటరీ పద్ధతిలో పెళ్లాడిన యువకుడు

Bangalore | సకలేశపుర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు. చివరికి ఈ ట్రయాంగిల్‌ స్టోరీ ఆ యువతులకు తెలిసినా అతన్నే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. దీంతో ఈ పంచాయితీ కాస్త పెద్దలకు ముందుకు వెళ్లింది. పంచాయితీలోనూ ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇదే సమయంలో ఓ యువతి.. అతడు లేని జీవితం తనకు వద్దని చెప్పి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్థులు సకాలంలో స్పందించి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. చికిత్స అనంతరం కోలుకుని ఆమె ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చింది. దీంతో తాజాగా మరోసారి ఈ వ్యవహారంపై పంచాయతీ జరగగా, గ్రామస్థులు ఓ పరిష్కారాన్ని సూచిస్తూ.. లాటరీ పద్ధతి ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని యువతులకు చెప్పారు. ఇద్దరు ఓకే చెప్పడంతో లాటరీ తీయగా, విషం తాగిన అమ్మాయి పేరే వచ్చింది. దీంతో అదే రోజు అమెతో వివాహం జరిపించారు.