‘‘ఉప్పెన’లో బేబమ్మ(కృతిశెట్టి) తండ్రి పాత్రలో నటించి తెలుగువారికి చేరువయ్యాను. ఆ సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత తమిళంలో ఓ ప్రాజెక్ట్ చేశాను. అందులో కథానాయికగా కృతిశెట్టిని ఎంచుకుంటే బాగుంటుందని టీమ్ భావించి.. ఆమె ఫొటో నాకు పంపించారు. నేను వెంటనే వాళ్లకు ఫోన్ చేసి.. ‘ఇటీవల ఓ సినిమాలో నేను ఆమెకు తండ్రిగా నటించాను. కూతురు పాత్ర పోషించిన ఆమెతో రొమాన్స్ చేయలేను. కాబట్టి ఆమె వద్దు’ అని చెప్పాను. ‘ఉప్పెన’ క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు ఆమె కొంచెం కంగారు పడింది. దాంతో నేను.. ‘బేబమ్మ.. నాకు నీ వయసు కొడుకే ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే. భయపడకు. ఎలాంటి కంగారు లేకుండా ధైర్యంగా చెయ్’ అని ప్రోత్సహించాను. కూతురిలా భావించిన ఆమెకు జోడీగా నటించడం నా వల్ల కాదు’’ అని విజయ్ సేతుపతి వివరించారు.
విలువలు కలిగిన నటుడు విజయ్ సేతుపతి. బేబెమ్మకు నో.
Related tags :