Health

సరికొత్త రోగం….Doorway Effect Syndrome

సరికొత్త రోగం….Doorway Effect Syndrome

హాల్‌లో కూర్చుంటారు.. బెడ్‌రూమ్‌లో ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ లేదా ఇతర వస్తువులేవో తెచ్చుకుందామని వెళ్తారు. బెడ్‌రూమ్‌ తలుపు దాటి లోపలికి వెళ్లగానే అసలు ఎందుకు వచ్చామన్న విషయం మరచిపోతుంటారు. ఇలాంటి అనుభవం మీకూ ఎదురయ్యే ఉంటుంది కదా! యూఎస్‌లోని నోట్రేడామ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 2011లో దీనిపై అధ్యయనం చేసి ‘డోర్‌వే ఎఫెక్ట్‌’ అని నామకరణం చేశారు. దీన్ని ‘లోకేషన్‌ అప్‌డేటింగ్‌ ఎఫెక్ట్‌’ అని కూడా పిలుస్తుంటారు. ఒక వ్యక్తి ఒక గది నుంచి మరో గదిలోకి అడుగుపెట్టినప్పుడు ముందు గదిలో ఉన్నప్పటి జ్ఞాపకాలను మెదడు చెరిపేస్తుందట. పడక గది, వంటగది, లివింగ్‌ రూమ్‌.. గదులకు సరిహద్దులు ఉండటం వల్లే ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కానీ, దీనికి గల కారణంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా బీఎంసీ సైకాలజీ జర్నల్‌లో ‘డోర్‌వే ఎఫెక్ట్‌’కి గల కారణం ఓ అధ్యయనంలో బయటపడిందని పేర్కొన్నారు.