Sports

శిఖర్ ధావన్ విడాకులు నిజమే!

శిఖర్ ధావన్ విడాకులు నిజమే!

తన విడాకుల విషయంపై టీమ్‌ఇండియా ఆటగాడు శిఖర్ ధావన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించాడు. ధావన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అయేషా ముఖర్జీని ఉద్దేశిస్తూ ‘ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి జీవితంపై అవగాహన, హృదయం అవసరం. దానిపై ప్రేమ ఉండాలి. అప్పుడే ఫలితాన్ని ఆస్వాదించొచ్చు. నీ కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయ్‌’అని పోస్టు చేశాడు. అంతకుముందు తాము విడిపోయామని అయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్‌ అయింది. ‘‘రెండో సారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదం తనకు చెత్త పదంగా అనిపించేదని’’ అయేషా పేర్కొంది. అయేషా ముఖర్జీతో ప్రేమలో పడిన ధావన్‌ 2012లో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయేషా ముఖర్జీకి గతంలోనే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిఖర్‌ ధావన్‌తో వివాహం జరిగాక 2014లో వారికి ఒక బాబు(జొరావర్‌) పుట్టాడు. దాదాపు 9 ఏళ్ల అనంతరం శిఖర్‌ జంట తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికింది.