అఖండ మూవీ పూర్తి చేసిన వెంటనే గోపీచంద్ చిత్రంలో బాలయ్య జాయిన్ కానున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి రౌడీయిజం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. రౌడీయిజం టైటిల్ ఫైనల్ చేస్తే ఇక బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి ఖాయమని అనుకుంటున్నారు సినీ జనాలు. బాలయ్య 107గా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పాపులర్ స్టార్ హీరోయిన్ పేరును ఫీమేల్ లీడ్ కోసం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలియానా, త్రిష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇలియానా గానీ త్రిషతో గానీ బాలయ్య రౌడీయిజం
Related tags :