తానా-క్యూరీ లెర్నింగ్ ఆధ్వర్యంలో గత నెల 22న అంతర్జాలంలో గణిత-సైన్స్ పోటీలు నిర్వహించారు. 3,4 తరగతుల, 5,6 తరగతుల, 7,8 తరగతుల విద్యార్థులకు మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో 600మందికి పైగా పాల్గొన్నారని క్యూరీ సంస్థ వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త డా.మూల్పూరి వెంకటరావు తెలిపారు. శనివారం నాడు విజేతల వివరాలను వెల్లడించారు. ఆ పట్టిక దిగువ చూడవచ్చు. విద్యార్థుల్లో ప్రతిభకు సానపెట్టే ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థులకు బహుమతులు, ధృవీకరణ పత్రాలు కోవిద్ నిబంధనలు అనుసరించి అందజేస్తామని వెల్లడించారు.
గణితం గ్రూప్1:
ప్రథమం-కడవకొల్లు గెష్ణశ్రీ
ద్వితీయ-బత్తుల కృష్ణ
తృతీయ-వైభవ గుణిచెట్టి
గణితం గ్రూప్2:
ప్రథమం-హాసిని, షమి, సత్య, శ్రీనందసాయి, ఆర్యన్, ప్రణవ్
ద్వితీయం-అనీష్
తృతీయం-అనిరుధ్, వర్ణిక, రుహాన్
గణితం గ్రూప్3:
ప్రథమం-అర్ణవ్, ఆర్యన్, భవ్య, ఈషా, జొవిన, సిరి, తనుష్, ఆదిత్య, తారుణ్
ద్వితీయం-మేధ, సహాన, సాయి, శ్రీవత్స, వేదాంష్, విశాల్
తృతీయ-ఆరవ్, నిశ్చయ్, నిత్య, నివేద్, సుదర్శన్, ఆన్వి, అభినవ్
సైన్స్ గ్రూప్1:
ప్రథమం: ధరంపురి ఆర్ణ
ద్వితీయం- హితవ్
తృతీయం-గెష్ణశ్రీ కొడవకొల్లు, సాయి సహస్ర పెరవల్లి
సైన్స్ గ్రూప్2:
ప్రథమం-హాసిని
ద్వితీయం-ఆహిర్, భవ్య, ప్రతీక్, సంహిత
తృతీయం-దీక్షిత, అమృత్
సైన్స్ గ్రూప్3:
ప్రథమం: జక్కంపుడి శ్రీసాయి
ద్వితీయం-పోలెపల్లె సాయి శ్రీకర్
తృతీయం-ఆర్యన్ రాజ్, రోనవ్ గోపాల్