బిగ్‌బాస్ కార్యక్రమం.. ఓ బ్రోతల్ స్వర్గమని, దీన్ని ఆపాలని మరోసారి కోర్టుకు వెళ్లనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు.
◆ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిగ్‌బాస్ షోపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా రెడ్‌లైట్ ఏరియా సంస్కృతిని తీసుకొస్తున్నారని మండిపడ్డారు.
◆ బిగ్‌బాస్ హౌస్‌లో యువతీయువకులను 105 రోజులు.. ఒకే గదిలో పెడుతున్నారన్నారు. లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని ప్రశ్నించారు. కార్యక్రమాన్ని 24గంటలూ లైవ్ పెట్టగలరా అని సవాల్ విసిరారు.
◆ ఒకరితో ముద్దు పెట్టుకొని.. మరొకరితో డేటింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఇది సాంస్కృతిక దోపిడీ అని దుయ్యబట్టారు. దీనికి హీరో నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారని.. తద్వారా సమాజానికి ఏం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
◆ తక్షణమే ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. బిగ్‌బాస్ కార్యక్రమం నిలిపేయాలని.. తాను చాలా ఏళ్లుగా పోరాడుతున్నారని చెప్పారు.
◆ తాను వేసిన పిటిషన్లను కోర్టులు పెండింగ్‌లో పెడుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై మరోసారి కోర్టుకు వెళ్లనున్నట్లు నారాయణ పేర్కొన్నారు.
◆ ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం వద్దు..ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం వల్ల నీటి కాలుష్యం పెరుగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంపై హైకోర్టు చెప్పినా..
◆ గణేష్ ఉత్సవ సమితి కోర్టుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైకోర్టు సలహాను పాటించాలని ఉత్సవ సమితికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని పాటించాలన్నారు.
◆ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చెప్పడం.. మంచి నిర్ణయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల విషయంలో అలాగే చేయాలని ఆయన సూచించారు.