DailyDose

పూనం మాలకొండయ్యకు జైలుశిక్ష-నేరవార్తలు

పూనం మాలకొండయ్యకు జైలుశిక్ష-నేరవార్తలు

* కోర్టు ధిక్కరణ కింద ఇద్దరు ఐఏఎస్‍లకు శిక్ష. పూనం మాల కొండయ్య, చిరంజీవి చౌదరికి శిక్ష విధించిన ఏపీ హైకోర్టు. కోర్టుకు హాజరుకానందున పూనం మాలకొండయ్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. సెరికల్చర్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోర్టు ఆదేశాలు. గత ఏడాది ఫిబ్రవరి 28న ఏపీ హైకోర్టు ఆదేశాలు. సకాలంలో కోర్టు ఆర్డర్‍ను అమలు చేయని అధికారులు. ఈనెల 29న శిక్ష ఖరారు చేయనున్న ఏపీ హైకోర్టు.

* అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దుకూ సీబీఐ కోర్టు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో సీఎం జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామ పిటిషన్‌ను కొట్టేసింది..

* నెల్లూరు జిల్లాలో యువతిపై జరిగిన దాడి కేసు లో ఇద్దరుని నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.మూడు బృందాలుగా గాలింపుల్లో పాల్గొన్న పోలీసులు.సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన ఎస్పీ విజయరావు.ప్రధాన నిందితుడు వెంకటేష్ను కలువాయి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.

* అఫ్గాన్​ తాలిబన్ల ప్రభుత్వంలో ఉప ప్రధానిగా నియామకం పొందిన ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌కు మంత్రివర్గంలో హక్కానీలకు ముఖ్య పాత్ర లభించడం ఏమాత్రం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. ఈ విషయమై హక్కానీలతో బరాదర్‌కు మాటల యుద్ధం జరిగిందని, మనస్తాపానికి గురైన ఆయన కాబుల్‌ను విడిచి వెళ్లిపోయి అజ్ఞాతంలో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

* బాలికపై అత్యాచారం, హత్య కేసు నిందితుడి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.సైదాబాద్‌ హత్యాచార నిందితుడిపై పోలీసులు రివార్డు ప్రకటించారు.నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు.సమాచారాన్ని 94906 16366 నంబర్‌కు లేదా 94906 16627 నంబర్‌కు చెప్పాలని విజ్ఞప్తి చేశారు.నిందితుడిని ఇంకా పట్టుకోకపోవటంపై కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అత్యాచారానికి పాల్పడింది పల్లంకొండ రాజు మాత్రమే అయినా అతడిని తప్పించేందుకు బస్తీవాసి ఒకరు సహకరించారని తెలిసింది.ఆ వ్యక్తే రాజును తప్పించాడని పోలీసులు భావిస్తున్నారు.నిందితుడు రాజు చరవాణి ఉపయోగించకపోవడం పోలీసుల గాలింపునకు ఆటంకంగా మారింది.