జర్మనీ దేశం హాంబర్గ్‌లోని బహుళ అంతస్తుల భవనంలో ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో బాపట్లకు చెందిన ప్రవాసాంధ్రుడు తాళ్లూరి భాస్కర్ మృతి చెందగా ఆయన భార్య పుష్ప తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు హాంబర్గ్ నుంచి దంపతుల స్నేహితులు బాపట్ల గ్రామీణ ఎస్సై వెంకటప్రసాద్‌కు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భాస్కర్ మృతిచెందినట్లు సోమవారం రాత్రి 11 గంటలకు బంధువులకు సమాచారం వచ్చింది. భాస్కర్ తండ్రి శివయ్య, తల్లి పార్వతి బాపట్లలో నివాసం ఉంటున్నారు. ప్రమాదంలో భాస్కర్, పుష్ప తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని బంధువు శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. యూకేలో ఉంటున్న భాస్కర్ సోదరుడు గణేష్‌కు సమాచారం తెలియగానే హాంబర్గ్‌కు బయలుదేరినట్లు పేర్కొన్నారు. దంపతులు ఆరేళ్ల క్రితం జర్మనీ వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు.
జర్మనీలో బాపట్ల ప్రవాసుడు తాళ్లూరి భాస్కర్ దుర్మరణం
Related tags :