అనంతపురం కియా పరిశ్రమలో జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం.. చిలికి చిలికి గాలివానలా మారింది. ఉద్యోగులు ఇనుప రాడ్లతో పరస్పరం తీవ్ర దాడులకు పాల్పడ్డారు. జూనియర్లు, సీనియర్లు అంటూ పరస్పరం నిందించుకుంటూ ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టుకున్నారు. ఈ దాడి ఘటనను కంపెనీలోని పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కంపెనీ నిర్వాహకులు ఈ ఘర్షణలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అనంత కియాలో ఇనుప రాడ్లతో గ్యాంగ్‌వార్
Related tags :