ఈనెల 25వ తేదీ రాత్రి నుంచి హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ మూత పడనుంది. అక్టోబరు 1 నుంచి బాటసింగారంలోని లాజిస్టిక్ పార్క్‌లో క్రయ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఇన్‌ఛార్జి ఛైర్మన్ ముత్యంరెడ్డి ప్రకటన విడుదల చేశారు. గతంలో కొవిడ్ తీవ్రత దృష్ట్యా గడ్డి అన్నారం మార్కెట్‌ను తాత్కాలికంగా మూసి కొహెడకు తరలించారు. భారీ వర్షాలకు అక్కడ సరైన వసతులు లేకపోవడం వల్ల వ్యాపారులు నిరాసక్తత వ్యక్తం చేశారు. తర్వాత గడ్డిఅన్నారంలో ఫ్రూట్ మార్కెట్ కలాపాలు యథావిధిగా జరిగాయి. ప్రస్తుతం మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలే మంత్రుల కమిటీ ఆ ప్రాంతాన్ని సందర్శించింది. తాజాగా గడ్డి అన్నారం మార్కెట్‌ను ఈనెల 25 రాత్రి నుంచి మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రేపటి నుండి శాశ్వతంగా మూతపడనున్న గడ్డిఅన్నారం మార్కెట్
Related tags :