తెలుగు చిత్ర పరిశ్రమకి ఉన్న నాలుగు స్తంభాల్లో అక్కినేని కుటుంబం ఒకటి. ఇండస్ట్రీని చెన్నై నుండి హైదరాబాద్ కి తీసుకొచ్చిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరావు. అలాంటి అక్కినేని కుటుంబానికి కోడలయ్యే అవకాశం దక్కించుకుంది లక్కీ గర్ల్ సమంత. అక్కినేని తరం మూడవ వారసుడుడైన నాగచైతన్యని 2017 అక్టోబర్ 7న పెళ్లి చేసుకుంది సమంత. అంతే అప్పటివరకున్న సమంత ఇమేజ్ కాస్త రెట్టింపు అయిపోయింది. పెళ్ళికి ముందు కూడా మంచి హిట్సే ఉన్నా.. పెళ్లి తరువాత మాత్రం వరుస బ్లాక్ బస్టర్స్ తో కెరీర్ లో పీక్స్ స్టేజికి వెళ్ళిపోయింది. అక్కినేని కోడలిగా సమాజంలో గొప్ప గౌరవమూ పొందింది. అన్నింటికీ మించి మోస్ట్ హంబుల్ హీరో అని పేరున్న నాగచైతన్య వంటి మొగుడిని దక్కించుకుంది. కానీ ఈ ఆనందాలన్నీ మూన్నాళ్ళ ముచ్చటే అని అంటున్నారు. అక్కినేని కుటుంబంతో సమంతకి పొసగడం లేదని పుకార్లు వస్తున్నాయి. అక్కినేని కుటంబ కట్టుబాట్లకు సమంత అడ్జెస్ట్ అవ్వలేక పోతుందని.. అందుకే నాగచైతన్యతో సామ్ విడాకులు తీసుకుంటుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. సొసైటిలో అక్కినేని ఫ్యామిలికున్న బ్రాండే వేరు. అక్కినేని కుటుంబమంటే సాఫ్ట్ అండ్ సింపుల్ అని పేరుంది. విదేశీయురాలైన హీరోయిన్ అమల.. అక్కినేని అమలగా మారగానే అక్కినేని కుటుంబ సంప్రదాయాలని గౌరవిస్తూ కట్టుబొట్టు మార్చేసి.. అక్కినేని కోడలిగా హుందాగా మారిపోయింది. ఈ పాయింట్ దెగ్గరే సమంతకి అక్కినేని ఫ్యామిలీతో సమస్యలు వస్తున్నాయట. సమంత అడ్వాన్స్ కల్చర్, మోడర్న్ డ్రెస్సులు, సోషల్ మీడియా అకౌంట్స్ లో పెళ్లి కానీ కుర్ర అమ్మాయిలు వేసుకునే బట్టలతో పోస్టులు..ఇవన్నీ కూడా నాగార్జునకి ఏ మాత్రం నచ్చడంలేదట. ఇదే విషయాన్నీ సమంతకి ఎన్నోసార్లు నాగార్జున చెప్పారట కూడా. అక్కినేని ఫ్యామిలీకి సమాజంలో గౌరవముందని, అక్కినేని ఇంటి కోడలిగా నీకు ఆ బాధ్యత ఉంటుందని, కాస్త గౌరవంగా ఉండాలంటూ ఎంత చెప్పినా సమంత పెడచెవిన పెట్టేదట. అయిన కొడుకు నాగచైతన్య కోసం ఇన్ని రోజులు చూసి చూడనట్టే ఉంటున్నారట నాగార్జున. అయితే నాగార్జునకి తీవ్రంగా బాధపెట్టిన అంశం.. లేటెస్ట్ గా సమంత పోషించిన రాజి పాత్రే అని టాక్ వినపడుతుంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మెన్’ లో.. శ్రీలంక తీవ్రవాదిగా సమంత పోషించిన బోల్డ్ క్యారెక్టర్ అక్కినేని కుటుంబానికి తీవ్ర ఆగ్రహజ్వాలలు తెచ్చేలా చేసిందట. ఆ వెబ్ సిరీస్ లో సమంత కొన్ని శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించటంతో పలువురు నుండి అక్కినేని ఫ్యామిలీకి అవమానకర మాటలు పడాల్సివచ్చిందట.. దాంతో అక్కినేని ఫ్యామిలీ సమంతని వివరణ అడుగగా… ఏకంగా ఆ అక్కినేని ఇంటిపేరునే తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి తీసేసిందట సమంత. అక్కడితో మొదలైన ఈ రచ్చ ఇప్పుడు ఏకంగా చైతన్య లాంటి మంచి మనసున్నభర్తని కూడా వదిలేసే స్టేజికి సమంత వచ్చేసిందట. తన స్వేచ్చకీ, అక్కినేని కుటుంబానికి సెట్ అవ్వదని సమంత విడాకులు తీసుకోబోతుందని అంటున్నారు. దీనికి కోసం సమంతకి భరణం కూడా అందుతుందట. విడాకుల తరువాత 300 నుండి 350కోట్ల వరకు భరణం కూడా సమంతకి ఇచ్చేందుకు నాగార్జున ఒప్పుకున్నట్టు సోషల్ మీడియాలో తాజాగా వార్తలొస్తున్నాయి.ఇప్పటికే ఫ్యామిలీ కోర్టుల వరకు విడాకుల కేసు అంశం వెల్లిదంటున్నారు. మరో రెండు నెలల్లో ఈ విడాకుల వార్త అఫీషియల్ గా ప్రకటిస్తారని కూడా వార్తలొస్తున్నాయి. అయితే ఈ గొడవలు, విడాకులు ఎంత నిజమో, ఎంత అబద్దమో ఇంతవరకు ఎవ్వరికి తెలియదు కానీ.. విడాకులతో నష్టం మాత్రం సమంతకే ఎక్కువంటున్నారు. అక్కినేని లాంటి గొప్ప ఫ్యామిలి మళ్ళీ సమంతకి దొరకడం కష్టమే అంటున్నారు. అన్నింటికీ మించి సౌమ్యుడు, మృదుస్వభావి, మంచి మనసున్నోడు, అక్కినేని దగ్గుపాటి రెండు కుటుంబాల వారసుడు, అయినా నాగచైతన్య లాంటి జెంటిల్మెన్ మాత్రం సమంతకి మళ్ళీ దొరకడని అంటున్నారు. ఇప్పటికైనా సమంత తప్పు తెలుసుకుని నాగచైతన్యతోనే ఉండాలని అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి మునుముందు ఏమవుతుందో.
ఫ్యామిలీమేన్ కారణంగా సమంత-నాగచైతన్యల మధ్య స్పర్థలు?
Related tags :