DailyDose

రాజమండ్రిలో రౌడీషీటర్ దొంగరెడ్డి దారుణహత్య-నేరవార్తలు

రాజమండ్రిలో రౌడీషీటర్ దొంగరెడ్డి దారుణహత్య-నేరవార్తలు

* రాజమండ్రి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో…సిటీఆర్.ఐ. పరిధిలో నివాసం ఉంటున్న దొంగరెడ్డి(28) అనే రౌడీ షీటర్ కు అతని ప్రత్యర్ధులు బ్లేడ్ బ్యాచ్ షూటర్ సాయి, రౌడీషీటర్ లక్ష్మణ్ మరో ఇద్దరితో పాత కక్షలు ఉన్నాయని ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగాయని తరువాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోగా మద్యం మత్తులో రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత మేడపై పడుకున్న దొంగరెడ్డిని నిద్రలేపి వెంట తెచ్చుకున్న మారణాయుధంతో విచక్షణారహితంగా నరికివేయడంతో అతను మరణించాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మూడో పట్టణ సీఐ మధు బాబు మాట్లాడుతూ నిందితుల కోసం గాలిస్తున్నామని ఇరువర్గాల మధ్య పాత కక్షలు ఉన్న నేపథ్యంలో ఈ దారుణ హత్య జరిగిందన్నారు.

* కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి 38లక్షలు రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు ఓ చీటర్. శనివారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్ లో సిఐ శ్రీనివాస నాయక్ ఎస్ఐ మస్తాన్ వలి సమక్షంలో నిందుతుడు విజయ్ కుమార్ ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన విజయ్ కుమార్ జల్సాలకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్ళాడు. 2019 ..2020… 2021 సంత్సరాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తప్పుడు ఐడి క్రియేట్ చేసి దాదాపు 20మంది నుండి డబ్బులు వసూలు చేశాడు.ఉద్యోగం ఇప్పించలేదు డబ్బులు వాపాసు ఇవ్వలేదు.దీంతో వినోద్ కుమార్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు కు విజయ్ కుమార్ మోసాలు బయట పడ్డాయి.విజయ్ కుమార్ ను కర్ణాటక లో అరెస్టు చేసి అతని వద్ద నుండి 3లక్షలు 50వేల నగదు 2ల్యాప్ ట్యాప్ లు1 స్కూటర్ ,1స్కూటీ స్వాదీనం చేసుకున్నారు.

* రాజేంద్రనగర్ లో రెవెన్యూ అధికారుల దాడులు. మూసి పరివాహక ప్రాంతాలలో వెలసిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించిన అధికారుల బృందం.

* నర్సంపేట బిట్స్ కాలేజీలో స్టూడెంట్స్ మధ్య ఫైట్. తోటి విద్యార్థి తోసివేయడంతో హాస్టల్ భవనంపై నుండి కిందపడి పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ విద్యార్థి సంజయ్ మృతి.