నూతన జెఈవోగా వీ.వీరబ్రహ్మయ్య బాధ్యతల స్వీకరణ. తిరుమల తిరుపతి దేవస్థానముల నూతన తిరుపతి జెఈవోగా వి.వీరబ్రహ్మయ్య శనివారం ఉదయం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ డెప్యూటీ ఈఓ రమేష్ బాబు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్ ను నూతన జెఈఓకు అందజేశారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్వహణ చేస్తున్న టిటిడి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో సేవ చేయడం గొప్ప అవకాశమన్నారు. టిటిడి నియమ నిబంధనల మేరకు తనకు విధులు నిర్వహించే శక్తిని ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు.
తితిదే నూతన JEOగా వీరబ్రహ్మయ్య
Related tags :