మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు: మంత్రి బాలినేని సీఎం జగన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు జరుగుతాయని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రివర్గంలోకి 100 శాతం కొత్తవారిని తీసుకుంటారని ఆయన తెలిపారు. పార్టీ విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంతో చెప్పానని మంత్రి బాలినేని పేర్కొన్నారు. తన మంత్రి పదవి పోయినా భయపడనని మంత్రి బాలినేని అన్నారు.
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసినపుడు తన మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తరువాత మారుస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇపుడు ఆ సమయం దగ్గర పడుతుండడంతో మంత్రుల్లో ఎవరు ఉంటారో, ఎవరు బయటకు వెళతారో అనే ఆందోళన నెలకొంది. తొలగించిన మంత్రులను పార్టీ నిర్మాణం కోసం వినియోగించుకుంటామని జగన్ గతంలోనే చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది మంత్రి పదవులను ఆశిస్తున్నారు.