DailyDose

నెల్లూరులో 209 ఎకాల ప్రభుత్వ భూమి కబ్జా-నేరవార్తలు

నెల్లూరులో 209 ఎకాల ప్రభుత్వ భూమి కబ్జా-నేరవార్తలు

* నెల్లూరు జిల్లాలో అధికారులపై క్రిమినల్ కేసులు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో భూ కుంభకోణం నేపథ్యంలో. 209 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రయివేటు వ్యక్తుల పేరిట మార్చిన అధికారులు.తహసీల్దార్ తో సహా 14 మంది పై క్రిమినల్ కేసులు.14 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.ఇప్పటికే ముగ్గురు అధికారులు సస్పెన్షన్.సబ్ రిజిస్ట్రార్ ప్రమేయంపై అధికారుల అరా!.

* కారంపూడి మండలంలో ప్రజలు రెవెన్యూ సేవల కోసం అందించిన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించరన్నా కారణంతో రెవిన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)తో సహా , ఒప్పిచర్ల 1, ఒప్పిచర్ల 2 విఆర్వో లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. దీనితో పాటు తహసీల్దార్ కు కూడా జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. సచివాలయల తనిఖీల సమయంలో రెవిన్యూ సేవలను బియాండ్ ఎస్ఎల్ఏ లో పరిష్కరిస్తున్న వారి పనితీరు మేరుగుపరుచుకోవాలని అధికారులు తగినంత సమయం ఇచ్చి వీడియో కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పదేపదే సూచనలు ఇచ్చినప్పటికి రెవిన్యూ సేవల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వీరిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవటం జరిగిందని బియాండ్ ఎల్ఎన్ఏ లను పరిష్కారంలో అట్టడుగు పనితీరు ఉన్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయంతో మండలంలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విఆర్ఓల పనితీరును మానిటరింగ్ చేయటంలో నిర్లక్ష్యం వహించారన్నా కారణంతో కారంపూడి మండల ఆర్ఐ కీర్తి స్రవంతిని జిల్లా అధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం. వీరితో తహసీల్దార్ స్థాయి అధికారికి కూడా కలెక్టర్ షోకాజ్ నోటీసు జారిచేయటంతో మండలంలో పనిచేస్తున్న విఆర్ఓ లు ఇతర రెవిన్యూ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

* కన్న తండ్రే కుమార్తె పట్ల కిరాతకుడిగా మారాడు. కుమార్తె అని కూడా చూడకుండా తన వాంఛ తీర్చాలని విచక్షణ కోల్పోయి అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు యత్నించాడు. చివరకు కుమార్తే అతడిని హతమార్చింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కోవిల్‌పురాయూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్‌ దివ్యాంగుడు. భార్య మరణం తరువాత ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. వెంకటేశ్‌ పెద్ద కుమార్తె చెన్నైలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా.. చిన్న కుమార్తె ఇంటి వద్దే ఉంటూ పదకొండో తరగతి చదువుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు కోసం వెళ్లి వచ్చిన వెంకటేశ్‌ తన ఇంట్లో విగతజీవిగా పడి ఉన్నాడు. బంధువులు, స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహంపై కత్తి పోట్లను బట్టి.. తొలుత రాజకీయ హత్యగా భావించారు. వెంకటేశ్‌ రెండో కుమార్తె తండ్రిని హత్య చేసిందని అనంతరం దర్యాప్తులో గుర్తించారు. ‘‘నా తండ్రి లైంగికంగా వేధించాడు.. ఆత్మరక్షణ కోసమే చంపేశాను’’ అని ఆమె చెప్పినట్లు డీఎస్పీ ఇళంగోవన్‌ తెలిపారు. అనంతరం పోలీసులు బాలికను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆత్మరక్షణ కోసం తండ్రిని చంపిన బాలికను వెంటనే విడుదల చేయాలని విల్లుపురం జిల్లా ఎస్పీ శ్రీనాథ ఆదేశించారు.

* కారు చోదకుడు రూ.55 లక్షలతో ఉడాయించిన ఘటన జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10సి ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డి వద్ద ఆరు నెలల కిందట కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన శ్రీనివాస్‌ డ్రైవర్‌గా చేరాడు. బోరబండలో ఉంటున్నాడు. కోకాపేటలో ఉంటున్న ఓ స్థిరాస్తి వ్యాపారికి రూ.55లక్షలు ఇచ్చి రమ్మని సంతోష్‌రెడ్డి డ్రైవర్‌కు సూచించాడు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనివాస్‌ కారులో నగదు తీసుకొని బయలుదేరాడు. సాయంత్రం 4 గంటలు దాటినా కోకాపేట చేరుకోలేదు. ఫోన్‌ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో అనుమానించిన సంతోష్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కారుని దొడ్ల భవనం వద్ద గుర్తించారు. అన్ని పోలీస్‌స్టేషన్‌న్లకు సమాచారం ఇచ్చి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.