ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కైనా హుజూరాబాద్ నియోజకవర్గానికి ఐదు వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తీసుకు వస్తామని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి కుమ్మరి కులస్థుల ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించుకుంటే నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. సభకు తరలి వస్తున్న కుమ్మరి కులస్థులను చూసి ఈటల రాజేందర్ ఆగం అవుతున్నాడని ఎద్దేవాచేశారు. కుమ్మరి కులస్థులకు గుజరాత్ రాష్ట్రం నుంచి ఎలక్ట్రికల్ సారెలు తెప్పించి ఆందజేస్తామని ప్రకటించారు. పెన్షన్, కరెంట్ సబ్సీడి కావాలని ఇక్కడికి వచ్చినవారు అడుగుతున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని హరీష్‌రావు తెలిపారు.
మావయ్య కాళ్లు మొక్కి 5వేల ఇళ్లు ఇప్పిస్తా
Related tags :