* రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర నేడు రికార్డు స్థాయికి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.16.9లక్షల కోట్లను తాకింది. ఉదయం 9.44 సమయంలో రిలయన్స్ షేరు జీవితకాల అత్యధికం రూ.2,510ని తాకింది. దాదాపు ఏడాది నుంచి ఈ కంపెనీ షేరు వరుసగా పెరుగుతూ వస్తోంది. దాదాపు ఏడాది కాలంలో ఈ కంపెనీ షేరు 25శాతం విలువ పెంచుకొంది.
* వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండు కమిటీలను సోమవారం ఏర్పాటు చేసింది. జీఎస్టీ నుంచి మినహాయించాల్సిన వస్తువులు, ప్రస్తుత శ్లాబ్ రేట్లు, జీఎస్టీ ఎగవేతదారుల మూలాలు, ఐటీ సిస్టమ్స్‌లో మార్పులు తదితర అంశాలపై ఈ కమిటీలు సమీక్షించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 17న జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో రెండు మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం మేరకు ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. అయితే, గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో కాపేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అలా చివరి వరకూ ఊగిసలాట మధ్య కదలాడి ఆఖరుకు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ముడి చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ భయాలు అలుముకొని సూచీలు అప్రమత్తంగా కదలాడాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.73.82 వద్ద ముగిసింది.
* పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు (ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లో)
1 సంవత్సరం డిపాజిట్లపై – 5.5 శాతం
2 సంవత్సరాల డిపాజిట్లపై – 5.5 శాతం
3 సంవత్సరాల డిపాజిట్లపై – 5.5 శాతం
5 సంవత్సరాల డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ లభిస్తుంది.
* ఎస్బీఐ రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై సాధారణ ప్రజలకు అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా..
7 రోజుల నుంచి 45 రోజులకు 2.9 శాతం
46 రోజుల నుంచి 179 రోజులకు 3.9 శాతం
180 రోజుల నుంచి 210 రోజులకు 4.4 శాతం
211 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు 4.4 శాతం
ఒక సంవత్సరం నుంచి రెండేళ్లలోపు 5.5శాతం
రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు 5.1 శాతం
మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు 5.3 శాతం
ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు 5.4 శాతం