ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన క్యాన్సర్ వైద్య నిపుణులు, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు.
రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులలో చేపడుతున్న నాడు నేడు, వైద్యఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చ.
క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సుధీర్ఘంగా చర్చ, పరస్పరం ఆలోచనలు పంచుకున్నామన్న డాక్టర్ నోరి.
రాష్ట్రానికి తగిన సహాయసహకారాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, దీనికి ముఖ్యమంత్రి సంతోషించారని వెల్లడించిన డాక్టర్ నోరి.
సీఎం ఆరోగ్యరంగంలో తీసుకున్న చర్యలన్నీ నాకు చాలా నచ్చాయి. మెడికల్ కాలేజీలను, జిల్లా ఆస్పత్రులను బాగు పరచడం అన్నది నాకు చాలా ఆనందాన్నిచ్చింది.
చిన్న గ్రామంలో క్యాన్సర్ రోగి ఉన్నా.. చికిత్స కోసం పెద్దనగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన.
ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్ నోరిని కోరిన ముఖ్యమంత్రి.
ఈ మేరకు ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం.