* సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్ పరిధిలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న రౌడీలు, కేడీలు, భూ కబ్జాదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. వారిపై ఉక్కుపాదం మోపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో పోలీస్ స్టేషన్‌లో ఎంత మందిపై రౌడీషీట్ నమోదైంది, వారంతా ఎలాంటి నేరాలకు పాల్పడేవారు, తరచూ ప్రజలను ఇబ్బందులకు, భయభ్రాంతులకు గురి చేస్తున్న వారెవరు జాబితాను సిద్ధం చేయాలని ఎస్‌హెచ్‌వోలను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పాటు కొత్తగా పుట్టుకొస్తున్న నేరస్థులు, రౌడీల అడ్రస్‌లు, లొకేషన్స్‌ను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన నేరస్థులతో పాటు పాత రౌడీలు, కేడీలు, భూ కబ్జాదారులను ఎస్‌హెచ్‌వోలు విడతల వారీగా పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. సీపీ ఆదేశాల మేరకు ఏసీపీల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇకపై నేరాలకు పాల్పడినా, పద్ధతి మార్చుకోకపోయినా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని సీపీ ఆదేశించినట్లు తెలిసింది.
* పాలకొల్లు విజయసాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అధినేత మానెం శ్రీనివాసరావు (55) ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో చించినాడ బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం… నా మృతి కి ఎవరూ బాద్యులు కాదని లెటర్ వ్రాసి తన మోటర్ సైకిల్ పై పెట్టినట్లు తెలిసింది…? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపెల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూబింగ్ చేస్తుండగా జిలెటిన్ స్టిక్స్, ఐడి బాంబులతో పాటు పేలుడు పదార్థాలు దొరికినట్టు సమాచారం. కాల్వపల్లికి కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో సింగారం వైపు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం,మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా చేపట్టిన కూంబింగ్లల భాగంగా పేలుడు పదార్థాలు డ్రమ్ము పేలుడు పదార్థాలు బ్యాటరీలు చార్జింగ్ లైట్లు కెమెరా సాహిత్యం కరపత్రాలు లభ్యఒ
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా గండ్ర సత్యనారాయణ చేరిక సభలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరియు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మొగుళ్లపల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రావు
* పోరుమామిళ్ల పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో రు.90 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన వీఆర్వో రామకృష్ణారెడ్డి..రంగసముద్రం గ్రామంలో 1081 సర్వేనెంబర్ లో ఒక ఎకరా 9 సెంట్ల భూమిని ఆన్లైన్ చేసి పాస్ బుక్ ఇచ్చేందుకు గురప్పఅనే వ్యక్తిని రు. 90,000 డిమాండ్ చేసిన వీఆర్వో రామకృష్ణారెడ్డి…లంచం తీసుకుంటుండగా వి.ఆర్.ఓ.ను వలపన్ని పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్.. దాడులలో పాల్గొన్న ఏసీబీ ఎస్.ఐ.లు కృష్ణమోహన్, రెడ్డెప్ప.
* హిందూపురం మండలం సుబ్బిరెడ్డి పల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ఒకరు మృతి.