* హైదరాబాద్ పాతబస్తీలో ఓ మహిళ ఇద్దరు మహిళ కానిస్టేబుల్స్ పై దాడికి పాల్పడింది,బహదూర్ చెందిన ఓ మహిళ తన భర్తపై పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకి న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసింది. అనంతరం రోడ్డు పైకి వచ్చి వీరంగం సృష్టించింది. వెంటనే న్యాయం చేయాలంటూ రోడ్డు పై నిలుచుని అరవడం ప్రారంబించింది.దాంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అక్కడే ఉన్న లేడీ కానిస్టేబుల్ లు మహిళను పక్కకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే పక్కకు తీసుకువెళుతున్న క్రమంలో మహిళ కానిస్టేబుల్ ల పైనే దాడికి పాల్పడింది. కానిస్టేబుల్ జుట్టు పట్టుకుని గోడకు కొట్టింది. అక్కడి తో ఆగకుండా కాళ్ళతో తన్నుతూ దూషించడం మొదలు పెట్టింది. అనంతరం మరికొంతమంది పోలీసులు చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు.
* పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో క్లబ్ 8 పబ్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర గాయాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు .ఘర్షణ లో గాయ పడ్డ వ్యక్తి ఒక కన్ను కోల్పోయినట్లు వైద్యుల ధృవీకరణ ,ఎల్.వి ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు.
* భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల_ పోడు భూముల హక్కుల సాధనకై సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఈనెల 5న జాతీయ రహదార్ల దిగ్బంధం పిలుపును జయప్రదం చేయండి—-అధికార ప్రతినిధి జగన్ జల్, జంగల్, జమీన్ ఆత్మగౌరవం కై విరోచితంగా పోరాడండి—-అధికార ప్రతినిధి జగన్….తెలంగాణ ప్రభుత్వం హరిత హారం పేరుతో ప్రజలను ముఖ్యంగా ఆదివాసీలను అడవుల నుండి గెంటివేస్తుంది—అధికార ప్రతినిధి జగన్…ఎన్నో ఏళ్ళుగా రైతాంగం సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కలు నాటుతూ బలవంతంగా లాక్కుంటుంది—అధికార ప్రతినిధి జగన్..కార్పోరేట్ సంస్థలకు ఖనిజ సంపదను అప్పగించే కుట్రలో భాగంగానే అటవి ప్రాంతంలో ఆదివాసీలకు అడవిపై, భూమిపై, నీళ్ళపై హక్కులు లేకుండా చేస్తుంది—అధికార ప్రతినిధి జగన్..
* డ్రగ్స్ కేసులో నిన్న అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అతడితో పాటు అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ దమేచాలను ముంబయి సిటీ కోర్టు ఈ నెల 7వరకు ఎన్సీబీ కస్టడీకి అనుమతించింది. క్రూజ్‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం, విక్రయం వ్యవహారంలో ఆర్యన్‌ఖాన్ సహా మొత్తం ఎనిమిది మందిని నిన్న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
* ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అభియోగపత్రంపై నాంపల్లి కోర్టు విచారణ ప్రారంభించింది. కేసులో నిందితులుగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, వేం కృష్ణకీర్తన్, సెబాస్టియన్ ఇవాళ నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. ఒక్కొక్కరు రూ.25 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. నాలుగో నిందితుడిగా ఉన్న మత్తయ్య జెరూసలేం విచారణకు గైర్హాజరయ్యారు. సమన్లు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరుకానందున మత్తయ్యపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏసీబీ ఛార్జ్ షీట్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేసిన ఈడీ.. ఇటీవల అభియోగపత్రం సమర్పించింది. ఈడీ కేసు తదుపరి విచారణను ఈనెల 29కి న్యాయస్థానం వాయిదా వేసింది. ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే ఉన్నందున విచారణను నవంబరు 1కి కోర్టు వాయిదా వేసింది.