బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో 5ఖ్ రన్ నిర్వహించారు. మన ఆరోగ్యం మన చేతుల్లో అన్న అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రవాసులు ఉల్లాసంగా పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులకు పలు పోటీలను ఏర్పాటు చేశారు. తెలుగు భాష, సంస్కృతి సంబంధ కార్యక్రమాలతో పాటు ఆరోగ్యపరమైన కార్యక్రమాలను సైతం GWTCS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు సాయి సుధా పాలడుగు తెలిపారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, GWTCS మాజీ అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ, టీడీఎఫ్ అధ్యక్షురాలు కవిత చల్లా, ఆటా కార్యదర్శి సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉల్లాసంగా సాగిన GWTCS 5కె రన్
Related tags :