ప్రవాస భారతీయ ప్రముఖుడు డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన ఫ్రిస్కోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మహాకవి శ్రీశ్రీకి స్థానిక సాహితీప్రియులు ఘననివాళులర్పించారు. డా. తోటకూర ప్రసాద్ తన స్వాగతోపన్యాసంలో శ్రీశ్రీ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలను, మహాప్రస్థానాన్ని తన సన్నిహిత మిత్రుడు కొంపల్లె జనార్ధనరావుకి అంకితం ఇవ్వడానికి గల కారణాలను వివరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మహాప్రస్థానంలోని కవితలను ఒక్కొక్కటిగా చదివి వినిపించారు. అనంత్ మల్లవరపు, ఎం.వి.ఎల్ ప్రసాద్, డా. అరుణజ్యోతి కోల, రాజశేఖర్ సూరిభొట్ల, రావు కల్వాల, డా. విశ్వనాధం పులిగండ్ల, డా. నక్త రాజు, డా. రమణ జువ్వాడి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కిరణ్మయి గుంట, డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, భాస్కర్ రాయవరం, శారద సింగిరెడ్డి, మురళి వెన్నం, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, లెనిన్ వేముల, చంద్రహాస్ మద్దుకూరి, చినసత్యం వీర్నపు, రాజేశ్వరి ఉదయగిరి, డా. జగదీశ్వరన్ పుదూర్, దయాకర్ మాడ, విశ్వేశ్వరరావు కంది, సురేష్ మానుకొండ, సింధు వేముల, సాహితి వేముల, శాంతా పులిగండ్ల, సుందర్ తురిమెల్ల, వెంకట్ ములుకుట్ల, సత్యన్ కళ్యాణ్ దుర్గ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయవాడ శ్రీశ్రీ ప్రింటర్స్ ముద్రించిన శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక ప్రతులను ఆవిష్కరించారు.
ఫ్రిస్కోలో శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక సంచికల ఆవిష్కరణ
Related tags :