Business

ఆర్టీసీలో సరికొత్త ఆఫర్లు ప్రవేశపెట్టిన సజ్జనార్

ఆర్టీసీలో సరికొత్త ఆఫర్లు ప్రవేశపెట్టిన సజ్జనార్

దసరా పండుగకు దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌలభ్యం కోసం వారి కాలనీలకు బస్సులు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకే ప్రాంతం లేదా కాలనీలోని 30 మంది ప్రయాణికులు దగ్గరిలోని డిపో నుంచి బస్సును బుక్‌ చేసుకుంటే బుధవారం నుంచి ఈ సౌకర్యం కల్పిస్తామన్నారు. దసరా ప్రత్యేక బస్సులు, టికెట్‌ ధరలు, సమయాల సమాచారం కోసం ఎంజీబీఎస్‌ (ఫోన్‌ నం. 99592 26257), జూబ్లీ బస్‌స్టేషన్‌ (99592 26264), రెతిఫైల్‌ బస్‌స్టేషన్‌ (99592 26154), కోఠి బస్‌స్టేషన్‌ (99592 26160) సమాచార కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ఇవి 24 గంటలూ పనిచేస్తాయన్నారు. సాధారణ ప్రజలతో పాటు కార్మికులు, వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. దసరాకు హైదరాబాద్‌ నలుమూలల నుంచి బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.