కావలసినవి:
వెల్లుల్లి రేకలు – 3
ధనియాలు, కొత్తిమీర తురుము – 1 టేబుల్ స్పూన్ చొప్పున
ఉప్పు – కొద్దిగా
ఓట్స్ పౌడర్, జొన్న పిండి, క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము, కొబ్బరి కోరు – పావు కప్పు చొప్పున
గడ్డ పెరుగు – 4 టేబుల్ స్పూన్లు
నీళ్లు – కొన్ని
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
నూడూల్స్ – బాల్స్ చుట్టేందుకు సరిపడా (నీటిలో ఉడికించి పక్కనపెట్టుకోవాలి)
తయారీ విధానం:
ముందుగా మిక్సీలో వెల్లుల్లి రేకలు, ధనియాలు, కొత్తిమీర తురుము వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్‌లో వేసుకుని, ఓట్స్ పౌడర్, జొన్న పిండి, క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము, కొబ్బరి కోరు, గడ్డపెరుగుతో పాటు నీళ్లు అవసరం అయితే కొద్దికొద్దిగా పోసుకుంటూ.. ముద్దలా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. నూడూల్స్ పొడవుగా పరచి.. రోల్స్ మాదిరి బాల్స్ చుట్టూ నూడూల్స్ చుట్టి, తడి చేత్తో నూడూల్స్ చివర్లను బాల్స్‌కి గట్టిగా ఒత్తాలి. నూనెలో దోరగా వేయించుకోవాలి.