* శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం సవలాపురం వద్ద చేపల చెరువుల యాజమాన్యం అక్రమాలకు అంతులేకుండా పోయింది. తురక పేట రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ చెరువు అక్రమాలకు నిలయంగా మారింది. ఈ చెరువునిర్మాణం చేపట్టడం నుంచి ఆరు గ్రామాల్లో పంట పొలాలు 300 ఎకరాలు ప్రతియేటా ముంపుకు గురవుతున్నాయి. చేతికొచ్చే వరి పంట నీట పాడవుతుంది. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఇటువంటి అక్రమ చెరువుల తవ్వకాలు జరిగాయి. దీనిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యవేక్షించి అధికారులు వివరణ కోరారు తక్షణమే ఇటువంటి చెరువులను మూసివేయాలని, దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంత జరుగుతున్నా మత్స్యశాఖ ఇటువంటి చర్యలు ఇంకా చేపట్టలేదు. చెరువు యజమాని నాగరాజుని ప్రశ్నించగా అంతా కోర్టులో ఉందని నేనేం చేయలేను అని తప్పుదోవ పట్టిస్తూ తూ తన వ్యాపార లావాదేవీలు జరుపుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షించి ఇటువంటి అక్రమ నిర్మాణాలు వెంటనే మూసివేయాలని రైతులను ఆదుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
* గుంటూరుజిల్లాలో పంచాయతీ సెక్రటరీ ల కష్టాలు.అమూల్ కి పాలు పోయించడం లేదని జిల్లాలో12 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ అమూల్ కి పాలు పోయించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని పంచాయతీ కార్యదర్శిలపై ఉన్నతాధికారులు ఆగ్రహం వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చిన గుంటూరు డీపీవో కేశవ రెడ్డి
* తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. స్కామ్ కు పాల్పడ్డ ముఠాలోని పది మందిని అరెస్ట్ చేశారు. కేసులో పది మందిని ముద్దాయిలుగా పేర్కొన్నారు పోలీసులు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీతో కుమ్మక్కై తెలుగు అకాడమీ డిపాజిట్లను నిందితులు కాజేశారు. ఈ ఏడాది జనవరి నుంచి స్కామ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కమీషన్ ఎర చూపించి.. బ్యాంక్, అకాడమీ సిబ్బందిని ముగ్గులోకి దింపారు నిందితులు. గతంలోనూ ఈ ముఠా పలు స్కామ్‌లకు పాల్పడినట్లు తెలుస్తోంది.
* శ్రీకృష్ణ జెవెల్లెర్స్ లో ఈడీ అధికారుల సోదాలు…మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు అధరాలు సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు
* నిందితులను పట్టుకునేందుకు వెళ్తే కుక్కలను వదిలిన దుండగులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.హత్యా యత్నం కేసులో నిందితుడి కోసం ఫిలిం నగర్ వెళ్లిన పోలీసులు..వారి మీదకు కుక్కలని వదిలిన నిందితుడు.. కుటుంబ సభ్యులతో కలిసి రాళ్లు బాటిల్స్ విసిరిన నిందితుడు..