కర్నూలు నగరానికి చెందిన విద్యార్థినికి కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి సహకారంతో యాభై వేల విలువైన లాప్ టాప్ కంప్యూటర్ అందజేశారు. కరోనా వైరస్ తీవ్రతతో ప్రతిభావంతులైన విద్యార్థులు కళాశాలకు హాజరు అవలేక పలు ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆదరణ కార్యక్రమంలో భాగంగా డి. అఖిల సాయి అనే విద్యార్థినికి ల్యాప్ టాప్ అందజేస్తున్నట్లు. ప్రతిభ గల విద్యార్ధినీ, విద్యార్దుల లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్, UTI బ్యాంకు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ రవి నాయక్, సందడి మధు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కర్నూలు విద్యార్థినికి పొట్లూరి రవి చేయూత
Related tags :