Devotional

జమ్మూలో శ్రీవారి ఆలయానికి ₹17కోట్లు

జమ్మూలో శ్రీవారి ఆలయానికి ₹17కోట్లు

టిటిడి ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి గారి అధ్య‌క్ష‌త‌న గురువారం తిరుమల అన్నమయ్య భవనంలో నూత‌న బోర్డు తొలి స‌మావేశం జరిగింది. ధర్మకర్తల మండలి స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ వివ‌రాలు ఇలా ఉన్నాయి…. – జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదం. – అలిపిరి కాలిబాట సుందరీకరణ పనులకు రూ.7.50 కోట్లతో టెండర్లకు ఆమోదం. – తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనం`2లో పలు ప్రత్యేక అభివృద్ధి పనులు మరియు మరమ్మతులు చేపట్టేందుకు రూ.2.61 కోట్లతో టెండర్లకు ఆమోదం. – స్విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌ రీసెర్చి భవనంలో అదనంగా 4, 5 అంతస్తుల నిర్మాణానికి రూ.4.46 కోట్లతో టెండర్లకు ఆమోదం.