Business

హెటిరోలో ఇంకా తేలని ₹550కోట్లు లెక్క

హెటిరోలో ఇంకా తేలని ₹550కోట్లు లెక్క

హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. హెటిరో సంస్థల్లో 4 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. ఇతర దేశాలకు హెటిరో భారీగా మందులు ఎగుమితి చేసింది. అమెరికా, యూరప్, దుబాయ్, ఆఫ్రికా దేశాలకు మందులను ఎగుమతి చేసింది. సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆధారాలను హెటిరో ధ్వంసం చేసినట్లు ఐటీ గుర్తించింది. చాలా వరకు నకిలీ ఇన్వాస్‌లు తయారు చేసినట్లుగా గుర్తించారు. కంపెనీ డబ్బులతో యాజమాన్యం భారీగా స్థలాలు కొనుగోలు చేసింది. 16 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. రూ.142 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.550 కోట్ల నగదు నిల్వలు లెక్కతేలాల్సి ఉంది.