DailyDose

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ రామనాథరెడ్డి అరెస్ట్-నేరవార్తలు

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ రామనాథరెడ్డి అరెస్ట్-నేరవార్తలు

* క్రూయిజ్ షిప్ రైడ్ కేసుకు సంబంధించి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సినీ నిర్మాత ఇంతియాజ్ ఖత్రి నివాసం మరియు కార్యాలయంలో దాడులు జరుగుతున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB పేర్కొంది. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో పార్టీపై దాడి చేసిన తర్వాత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో ఆర్యన్ ఖాన్, అర్బాజ్ సేథ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచా బెయిల్ పిటిషన్‌ని ముంబై ఎస్ప్లానేడ్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది.ఇంతలో, ఎన్‌సిబి, ముంబై జోన్ డైరెక్టర్ సమీర్ వాంఖడే శుక్రవారం మాట్లాడుతూ, ఎన్‌సిబి మరియు ప్రాసిక్యూషన్ క్రూయిజ్ షిప్ రైడ్ కేసును తార్కిక ముగింపుకు చేరుకోవడానికి ప్రయత్నిస్తాయని చెప్పారు. “మేము మరియు హింస కేసును తార్కిక ముగింపుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాము. మా కేసు బలంగా ఉంది మరియు సెషన్స్ కోర్టులో సమర్పించబడుతుంది” అని వాంఖడే చెప్పారు. అక్టోబర్ 2 రాత్రి సముద్రతీరంలో గోవాకు వెళుతున్న కార్డెలియా క్రూయిజ్ షిప్‌లో ఎన్‌సిబి బృందం డ్రగ్స్ పార్టీని ఆరోపించింది. ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో జరిగిన పార్టీలో దాడి చేసిన తర్వాత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో నైజీరియన్ జాతీయుడితో సహా మొత్తం 18 మందిని అరెస్టు చేశారు.

* వనపర్తి జిల్లా ఆత్మకూర్​లో ఓ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి నయా చీటింగ్ కలకలం రేపుతోంది. ​ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం ఆత్మకూర్​ పోలీస్​ స్టేషన్​ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వనపర్తి డిఎస్పీ కె.ఎం.కిరణ్​ కుమార్​, సీఐ రత్నం, ఎస్​ఐ రాఘవేంద్రలతో కలిసి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆత్మకూర్​ వెంకట్​ రెడ్డి కాలనికి చెందిన అరుణ్​ రెడ్డి(29) అనే రియల్​ ఎస్టేట్​ వ్యాపారితో అదే కాలనీకి చెందిన సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ సురేష్​తో ఇటీవల పరిచయం ఏర్పడింది. ఇటీవల గవర్నమెంట్​ టీచర్​గా రిటైర్ట్​పొందిన సురేష్​ తండ్రి పంతులు శివానంద్ కు చెందిన​ రిటైర్​మెంట్​ బెనిఫిట్స్​తోబాటుగా, తనతో ఉన్న డబ్బులతో స్థిరాస్థి కొనుగోలు చేయాలని భావించారు. ఇందుకుగాను ఆత్మకూర్​ భార్గవి నగర్​ సమీపంలో అరుణ్​ రెడ్డి అగ్రిమెంట్​ చేసుకున్న 2.28ఎకరముల వ్యవసాయ భూమిని రూ.55 లక్షలకు కొనుగోలు చేశారు. అప్పటికే పూర్తిగా డబ్బులు తీసుకున్న అరుణ్​ రెడ్డి కేవలం1.16 ఎకరముల భూమిని మాత్రం సురేష్​ పేరు మీద రిజిస్ట్రేషన్​ చేశాడు. మిగిలిన 1.16 ఎకరముల భూమిని కూడా రిజిస్ట్రేషన్​ చేస్తానని విశ్వాసం కలిగించిన నిందితుడు ఈ నెల 4న రిటైర్ట్​ టీచర్​ పంతులు శివానంద్​ ఇంటిని సందర్శించి ఆధార్​, పాన్​కార్డులతోబాటుగా మూడు చెక్కులు తీసుకోవాల్సిందిగా సూచించాడు. మహబూబ్​నగర్​లో ఉన్న తన కొడుకు సురేష్​ ను కలిసి వద్దామని నమ్మబలికిన నిందితుడు… రిటైర్ట్​ టీచర్​ను తన కారులో ఎక్కించుకున్నాడు. కొత్తకోటకు చేరుకున్నాక మద్యం తీసుకోవాల్సిందిగా కోరాడు. అనంతరం మద్యం తాగామని, మహాబూబ్​నగర్​కు వద్దని చెప్పిన నిందితుడు అదే రోజు రాత్రి 10 గంటలకు ఆత్మకూర్​కు తిరుగు ప్రయాణంలో కొత్తపల్లి వాగువద్ద కారు ఆపాడు. అక్కడ మరో బీరు తాగిన తర్వాత మత్తులో ఉన్న రిటైర్ట్​ టీచర్​ శివానంద్​ పై నిందితుడు దాడి చేసి మూడు చెక్కులను లాక్కున్నాడు. ఒక చెక్కుపై సంతకం చేయించుకుని శివానంద్​ను వాగులోకి తోసివేశాడు. అనంతరం అక్కడినుంచి ఆత్మకూర్​కు చేరుకున్న అరుణ్​ రెడ్డి మరుసటి రోజు ఈనెల5న స్థానిక ఎస్​బిఐ బ్యాంకులో రూ.12లక్షలు డ్రా చేసుకున్నాడు. రాత్రంతా వాగునీటిలోనే బిక్కు బిక్కు మంటూ ఓ కట్టె సహాయంతో ఉన్న రిటైర్ట్​ టీచర్​ను తెల్లవారుజామున మత్స్యకారులు గమనించి ఒడ్డుకు తీసుకువచ్చారు. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ నెల 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సవాల్​గా తీసుకున్న పోలీసులు గురువారం ఉదయం నిందితుడు అరుణ్​రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి ఇంట్లో సోదాలు చేసి రూ.12లక్షలు, రెండు చెక్కులు, కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అరుణ్​రెడ్డిని ఆత్మకూర్ జూనియర్​ సివిల్​ కోర్టుకు హాజరు పరుచగా రిమాండ్​కు తరలించినట్లు డిఎస్పీ కిరణ్​కుమార్​ తెలిపారు. కాగా కేసును సవాల్​గా తీసుకుని 24 గంటలలో చేధించిన ఆత్మకూర్​ పోలీస్​ సీఐ, ఎస్​ఐ, సిబ్బందిని జిల్లా ఎస్​పి అపూర్వరావు అభినందించినట్లు డిఎస్పీ తెలిపారు.

* ఆత్మకూరు ఆంధ్రజ్యోతి విలేకరి ప్రభాకర్ ఇంటిపై దాడి కేసులో 15మందిపై కేసు నమోదు చేశామని పరకాల ఏసీపీ శివరామయ్య తెలిపారు.

* బంగారం అక్రమ రవాణా అడ్డుకొనేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆగడంలేదు. శంషాబాద్‌ కేంద్రంగా అక్రమంగా పసిడి రవాణా వ్యవహారం మరోసారి బయటపడింది. ఫేస్‌క్రీమ్‌ డబ్బాల్లో బంగారం తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు అక్రమంగా తీసుకువచ్చిన 528 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ తెలియకుండా ఫేస్‌క్రీమ్‌ డబ్బాల్లో నిందితుడు ఈ బంగారాన్ని తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఈ బంగారం విలువ సుమారు రూ.20.44 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

* తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ కేసులో మరో ముగ్గురిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. భూపతి, రమణారెడ్డి, సురభి వినయ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. సురభి వినయ్‌ తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్‌ సోమిరెడ్డికి పీఏగా పనిచేశారు. రమణారెడ్డి ప్రధాన నిందితుడు సాయికి అనుచరుడిగా ఉన్నారు. భూపతికి ఎఫ్‌డీల నకిలీ పత్రాలతో సంబంధం ఉందని సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు తెలుగు అకాడమీ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 14కి చేరింది. రూ.64.5 కోట్ల కుంభకోణం కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్న సీసీఎస్‌ పోలీసులు ఆధారాల కోసం సమగ్ర విచారణ జరుపుతున్నారు. కొట్టేసిన డబ్బును నిందితులు రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు సైతం రంగంలోకి దిగారు. నిందితులు మనీల్యాండరింగ్‌కు ఏమైనా పాల్పడ్డారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

* హెటిరో డ్రగ్స్‌ సంస్థలపై నాలుగో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రెండు మూడు ప్రైవేటు లాకర్లలో దాదాపు రూ.150 కోట్లు నగదు ఐటీ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మూడు కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. స్వాధీనం చేసుకున్న నగదును కౌంటింగ్‌ చేయడానికి, నోట్ల పరిశీలన కోసం భారతీయ స్టేట్‌ బ్యాంకు చెందిన ప్రత్యేక బృందాలను రప్పించినట్లు సమాచారం.
ఈ బ్యాంకు అధికారుల బృందాలు నోట్లను పరిశీలించి కౌంటింగ్‌ పూర్తయ్యాక ఆ మొత్తాన్ని ఎస్‌బీఐ సెస్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, నగదు, బంగారంపై ఆరా తీసేందుకు మరొక ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఆ బృందం నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న ప్రైవేటు లాకర్లకు నిర్వహకులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

* అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ రామనాథరెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. కుప్పం- కృష్ణగిరి హైవేలో రామనాథరెడ్డిని అరెస్టు చేశారు. ఎర్రచందనం తరలిస్తుండగా చిత్తూరు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తెల్లవారుజాము 3గంటలకు రామనాథరెడ్డిని పట్టుకొని.. రూ.50లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అతడితో పాటు ముగ్గురు అనుచరులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఈసీ ఏఎస్పీ విద్యాసాగర్‌ వెల్లడించారు.