Politics

తెలంగాణా ధైర్యం ఇచ్చింది. ఏపీ దిగజారిపోయింది.

తెలంగాణా ధైర్యం ఇచ్చింది. ఏపీ దిగజారిపోయింది.

పోరాటం చేస్తేనే అడుగు ముందుకు వేయగలమని తెలుసు… భయపెట్టిన కొద్దీ బలపడతాం తప్ప భయపడే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. చేవెళ్ల అజీజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ‘‘రాజకీయాల్లోకి వస్తుంటే అందరూ నన్ను భయపెట్టారు.. కానీ, తెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చింది. 2009లో రాజకీయాలు నా ఆధీనంలో లేవు. అప్పుడు పార్టీ వేరొకరి చేతిలో ఉంది. రాజకీయ చదరంగంలో జనసేనది సాహసోపేత అడుగు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి నన్ను నడిపిస్తోంది. తెలంగాణ ప్రజలకు నేను రుణపడి ఉన్నా. రాజకీయాలకు బలమైన భావజాలం ఉంటే చాలు’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు

ఏపీలో అభివృద్ధి దిగజారిపోయిందని జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు కులాల మధ్య పోరాటం జరుగుతోంది. అభివృద్ధిని అడ్డుకునే వారు ఎవరైనా సరే బద్ధ శత్రువులే. రాజకీయ నేతలు నాకు శత్రువులు కారు. ప్రపంచం మారాలి. సమాజం మారాలని కోరుకుంటాం. ఏదైనా సరే అడుగుపెడితే తప్ప అనుభవం రాదు. గెలుస్తామా.. ఓడుతామా నాకు తెలియదు. నేను రాజకీయాల్లోకి వస్తుంటే భయపెట్టారు. మార్పు కోసం, బలమైన సామాజిక మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చా. అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయాల్లో మత ప్రస్తావన ఉండకూడదు. కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోతాయ్‌. కులాలను రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు’’ అని పవన్‌‌కల్యాణ్‌ పేర్కొన్నారు.