దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుచే 39 సంవత్సరాల క్రిందట స్థాపించబడిన తెలుగుదేశం పార్టీకి బలీయమైన, కీలకమైన అమెరికా ఎన్నారై తెదేపా శ్రేణుల జాబితా నేడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. 25 దేశాల్లోని 153 పట్టణాల్లో ఉన్న 581 మంది పార్టీ అభిమానులు, కార్యకర్తలను కౌన్సిల్ సభ్యులుగా ఈ జాబితాలో ప్రకటించారు. అమెరికా ఎన్నారై తెదేపా ప్రారంభం నుండి పార్టీకి దిక్సూచిగా నిలబడిన కోమటి జయరాం, చినబాబు లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు వేమూరు రవిల పేర్లు లేకుండానే అమెరికా ఎన్నారై తెదేపా జాబితాను విడుదల చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాలిఫోర్నియాలో బే-ఏరియా, లాస్ ఏంజిల్స్, మిల్పిటాస్ ప్రాంతాలను జాబితాలో విభజించినప్పటికీ ఎందులోను కోమటి జయరాం పేరు ప్రస్తావించలేదు. ఇటు టెక్సాస్‌ను డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్ కింద విభజించిన జాబితాలో సైతం వేమూరు రవికుమార్ పేరు మాయమైంది. వీరిని వేరే పదవుల్లో ఏమైనా నియమిస్తారో లేదో వేచి చూడాల్సిందే. డెట్రాయిట్‌కు చెందిన మరో ఎన్నారై తెదేపా నేత నాదెళ్ల గంగాధర్ పేరు కూడా జాబితాలో చోటు దక్కించుకోలేదు. ఎంతైనా చంద్రబాబు మార్క్ రాజకీయం కదా…అప్పుడప్పుడు ఇలాంటి ఝలక్‌లు సహజమే!
Breaking: కోమటి వేమూరు లేని ఎన్నారై తెదేపా జాబితా విడుదల
Related tags :