Movies

“మా”లో చల్లారని లొల్లి. పుట్టుకొచ్చిన కొత్త సంఘం.

* సిని‘మా’ బిడ్డలం ప్యానెల్‌ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని ఆరోపించారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్‌ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారని అన్నారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని అన్నారు. తమ ప్యానెల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి, ‘మా’ సభ్యుల తరపున నిలబడతామని స్పష్టం చేశారు. ‘‘నేను మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. అందుకు మంచు విష్ణు ఆమోదించను అని అన్నారు. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. కానీ, ఒక షరతు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘మా’ నియమ, నిబంధనలు మార్చి, ‘తెలుగువాడు కాని వ్యక్తి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదు’ అని మీరు మార్చకపోతే మా సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటా. ఒకవేళ మారిస్తే, ఓటు వేయడానికో, గెలిపించడానికో నాకు ఇష్టం లేదు’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. పదవులు లేకపోయినా అండగా ఉంటాం: శ్రీకాంత్. పదవులు లేకపోయినా విష్ణుకు అండగా ఉంటామని కథానాయకుడు శ్రీకాంత్‌ అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌నుంచి విజయం సాధించిన ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎవరు ఓటు వేసినా, ఒక ప్యానెల్‌ మొత్తానికి ఓటేయండి అని మేము మొదటి నుంచి ‘మా’ సభ్యులను కోరుతున్నాం. పని బాగా జరగాలంటే అది ముఖ్యం. మెంబర్స్‌ ఉన్న వాళ్లలో అందరూ అందరికీ నచ్చాలని లేదు. ఆ ప్యానెల్‌లో కొంతమంది, ఈ ప్యానెల్‌లో కొంతమంది గెలిచాం. అన్నేసి మాటలు అనుకున్నాక కలిసి పనిచేయగలమా? అనిపించింది. మా ప్యానెల్‌లోని సభ్యులు నిన్నే రాజీనామా చేస్తామని అన్నారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో ఇలాగే కలిసి పనిచేసినప్పుడు విభేదాలు తలెత్తాయి. ఏ సమస్య ఎత్తిచూపినా ‘మమ్మల్ని పనిచేయనీయడం లేదు’ అని అంటారు. విష్ణు నాకు సోదరుడులాంటి వారు. నరేశ్‌ చాలా అద్భుతంగా ఎన్నికలను నడిపించారు. తన అనుభవంతో కృష్ణుడిలా చక్రం తిప్పి విష్ణుకు విజయం చేకూర్చారు. ఆయన విష్ణు వెనుక ఉన్నప్పుడు మేము ఏదైనా అంటే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. మా ప్యానెల్‌లో ఉన్న వారంతా తప్పు జరిగితే ప్రశ్నించే ధైర్యవంతులు. మేం వెళ్లి ప్రశ్నిస్తే మళ్లీ గొడవలు అవుతాయి. పదవులు లేకపోయినా అందరికీ మేం అండగా ఉంటాం. మా అసోసియేషన్‌లో పరిణామాలపై చాలా సహిస్తూ వచ్చాను. నరేశ్‌ నన్ను అనేక మాటలు అన్నా భరించాను’’అని శ్రీకాంత్‌ అన్నారు.

* A – ssociation of T – elugu M – ovie A – rtist…New Association in Film Industry – MEGA PLAN

* తెలుగు వాడు కానీ వాడు కూడా పోటీ చేయడానికి వీలు ఉంది అని మంచు విష్ణు హామీ ఇస్తే.. బై లాస్ మార్చమని చెబితే నా రాజీనామా వెనక్కి తీసుకుంటా -ప్రకాష్‌రాజ్

* ఎన్నికల రోజు మోహన్ బాబు తిడుతున్నారు, విష్ణు గొడవ వద్దు అన్నారు. మోహన్ బాబు కొట్టడానికి వచ్చారు, పచ్చి బూతులు తిట్టారు, అరగంట సేపు తిట్టారు.. డీఆర్సీ పెద్దమనిషి గొడవ జరిగితే ఆపాలి.. కానీ, ఎవరు అలాంటి ప్రయత్నం చేయలేదు-బెనర్జీ

* జరిగిన సంఘటనలపై చర్చించాం ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది ఎన్నికల్లో రౌడీయిజం చేశారు… ప్రకాశ్ రాజ్

*