అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) చికాగో విభాగం ఆధ్వర్యంలో శనివారం నాడు అరోరా బాలాజీ ఆలయంలో దసరా & బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇల్లినాయిస్ 11వ డిస్ట్రిక్ట్ కాంగ్రెసు సభ్యుడు బిల్ ఫాస్టర్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. బిల్ ఫాస్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికాలో ఇంజనీరింగ్, మెడికల్, వ్యాపార రఒగాలలో తెలుగు వారు ఎంతో ప్రాముఖ్యాన్ని సాధించారని బిల్ ఫాస్టర్ కొనియాడారు. అనంతరం సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన మహిళలు, పిల్లలు బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. యాంకర్ గా మధు వ్యవహరించారు. సరితా నంద్యాల బృందం కోలాటం, రుద్ర గర్జన అండ్ చికాగో చేతన బృందం డోలు వాయిద్యా ప్రదర్శనల అనంతరం మేళ తాళాలతో నిమజ్జనం నిర్వహించారు.
బోర్డు అఫ్ ట్రస్టీ డాక్టర్ మెహర్ మేడవరం, ఆటా ట్రెషరర్ & ట్రస్టీ సాయినాథ్ రెడ్డి బోయపల్లి, ఆటా ఆఫీస్ కోఆర్డినేటర్ మహీధర్ ముస్కుల, రీజినల్ కోఆర్డినేటర్స్ వెంకట్రామ్ రెడ్డి రావి, వెంకటేశ్వర రామిరెడ్డి, సుచిత్ర రెడ్డి, చల్మా రెడ్డి బండారు, వెంకట్ థుడి, మహిపాల్ వంఛ, భాను స్వర్గం, నరసింహ చిత్తలూరి, లక్ష్మి బోయపల్లి, కరుణాకర్ దొడ్డం, అమరేంద్ర నెట్టం, రమణ అబ్బరాజు, సతీష్ యెల్లమిల్లి, విశ్వనాధ్ చిత్ర, హరి రైని, జగన్ బుక్కరాజు, భీమిరెడ్డి, సుచిత్ర రెడ్డి, పద్మ ముస్కుల, దీప్తి వంచా, వైశాలి రావి, తులసి రెడ్డి, హారతి థుడి, అపర్ణ కొల్లు, లావణ్య గుండు, నందిని బుక్కరాజు, దీపికా నమసాని, స్వాతి రావ్, ఆశ తుళువ, సుప్రీతా కేశవరావు , ప్రసూనా రెడ్డి ఓరుగంటి, సుధా కుందూరు, అనిత కొప్పర, ఆశ రెడ్డి పాశం, మల్లేశ్వరి పెద్ధమల్లు, సరితా చల్ల తదితరులు వేడుకల నిర్వహణకు తోడ్పడ్డారు. ఆటా అధ్యక్షుడు భువనేశ్ బుజాల, ప్రెసిడెంట్-ఎలెక్ట్ మధు బొమ్మినేని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకి దసరా-బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
చికాగోలో ఘనంగా ఆటా దసరా-బతుకమ్మ
Related tags :