తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తితిదే ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధికి చేరుకున్న సీజేఐ తొలుత మూలమూర్తిని దర్శించుకుని రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ జస్టిస్ ఎన్వీ రమణకు వేద పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్ధప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు. సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ జె.కె.మహేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం జరిగిన చక్రస్నానం ఘట్టంలో సీజేఐ సహా ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. మూలవిరాట్ అభిషేకం అనంతరం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల అభిముఖంగా ఉన్న అఖిలాండం వద్ద జస్టిస్ ఎన్వీ రమణ కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే, బేడి ఆంజనేయస్వామివారిని కూడా దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్.నూతలపాటి వెంకటరమణ
Related tags :