తెదేపా ఏపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా న్యూజెర్సీకి చెందిన గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుడు మన్నవ మోహనకృష్ణను ఆ పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. గుంటూరులో కళాశాల విద్యార్థిగా తెలుగు విద్యార్థి విభాగం, తెలుగు యువత విభాగాల్లో మన్నవ మోహనకృష్ణ చురుగ్గా పనిచేశారు. అనంతరం అమెరికాకు వచ్చినప్పటికీ పార్టీతో అనుబంధాన్ని ఎన్నారై తెదేపాలో భాగస్వామ్యుడిగా కొనసాగించారు. బాలయ్యకు సన్నిహితుడిగా పేరు కలిగిన ఆయన నియామకం పట్ల ఎన్నారై తెదేపా సభ్యులు హర్షం వెలిబుచ్చారు. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అధ్యక్షుడిగా కూడా మన్నవ సేవలందించారు. తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలను పార్టీ శ్రేణుల సహకారంతో సమర్ధవంతంగా నిర్వహిస్తూ టిడిపి బలోపేతానికి చిత్తశుద్ధిగా కృషి చేస్తానని మోహనకృష్ణ అన్నారు.
తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మన్నవ మోహనకృష్ణ
Related tags :