Politics

సోనియాగాంధీ సంచలన నిర్ణయం-తాజావార్తలు

సోనియాగాంధీ సంచలన నిర్ణయం-తాజావార్తలు

* భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్ భగవత్‌ ఆరోపించారు. విజయదశమి సందర్భంగా నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం సంఘ్‌ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్థాన్‌, తాలిబన్‌, ఉగ్రవాదం నుంచి జనాభా నియంత్రణ వరకు పలు అంశాలపై మాట్లాడారు. ఆరెస్సెస్‌ ఏటా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి ఇజ్రాయెల్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొబ్బి షొషానీ అతిథిగా హాజరయ్యారు. జనాభా నియంత్రణ విధానాన్ని మరోసారి తీసుకురావాల్సిన అసవరం ఉంది. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించాలి. ఇది అందరికీ సమానంగా వర్తింపజేయాలి. జనాభా అసమతుల్యత పెద్ద సమస్యగా మారిందన్నారు.

* కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందని బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తోన్న జీ-23 నేతల విమర్శలకు ఆమె చెక్ పెట్టారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, లఖింపుర్ ఘటన, పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు..తదితర అంశాలే అజెండాగా శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేసిన సోనియా.. దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై మాట్లాడారు.

* ‘ఏక్‌ శ్యామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ కోసం చార్మినార్‌ పరిసరాల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు సీపీ అంజనీకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు చార్మినార్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఈ ఆదివారం నుంచి ‘ఏక్‌ శ్యామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనికోసం అఫ్జల్‌ గంజ్‌, మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్‌ హౌస్‌ నుంచి మెట్టీ కా షేర్‌, కాళీకమాన్‌, ఎతెబార్ చౌక్‌ వైపు మళ్లించనున్నారు. ఫలక్‌నుమా, హిమ్మత్‌ పురా నుంచి వచ్చే వాహనాలు పంచమొహల్లా నుంచి షా ఫంక్షన్ హాల్‌, మొఘల్‌ పురా ఫైర్‌ స్టేషన్‌ రోడ్‌, బీబీ బజార్‌ వైపు మళ్లించనున్నారు.

* మహీంద్రా థార్‌కు తీసిపోకుండా అదే స్టైల్‌తో జిమ్నీ రానుంది. మారుతి తీసుకువస్తోన్న ఆఫ్‌ రోడ్‌ ఎస్‌యూవీ కస్టమర్లను ఇట్టే కట్టిపడేస్తుంది. మారుతి సుజుకీ జిమ్నీకి సంబంధించిన టీజర్‌ను సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో లాంచ్‌ చేసింది. అన్ని రకాల భూభాగాల్లో అడ్వెంచరస్‌ డ్రైవింగ్‌ అనుభూతిని వాహనదారులకు కచ్చితంగా అందిస్తోందని మారుతి సుజుకీ పేర్కొంది.

* నాలుగు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సేవలు అవును.. మీరు చూసింది నిజమే…! ఇది కేవలం బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌, భారత్‌ ఫైబర్‌, డీఎస్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ ఓవర్‌ వైఫై కస్టమర్లకు మాత్రమే…! ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు నాలుగు నెలల పాటు ఉచిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించనుంది.

* పండుగ సీజన్ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. యూత్ ఎక్కువగా వాడే బీర్ల సేల్స్ గత ఏడాది తో పోలిస్తే అమాంతం పెరిగింది. అటు లిక్కర్ సేల్స్ లోనూ దాదాపు ఇదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 11 రోజుల్లో 1400 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే సేల్స్ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం అవుతోంది. బీర్ల అమ్మకాలు 53శాతం పెరుగగా లిక్కర్(హార్డ్) సేల్ 34 శాతం పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. డిపోల నుంచి వైన్స్ లు, మాల్స్, బార్ లకు నిన్న ఒక్క రోజే 178 కోట్ల 18 లక్షల విలువ గల మద్యం చేరిందంటే డిమాండ్ ఏ మేరకు ఉందో అర్థం_ అవుతుంది. రెండు నెలల క్రితం వరకు బీర్ల అమ్మకాలు ఘోరంగా పడిపోగా.. ఏం జరిగిందో కానీ ఊహించని రీతిలో ఒక్కసారిగా బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈనెలలో మద్యం డిపోలకు గాంధీ జయంతి (అక్టోబర్ 2 ), ఇతర సెలవులు పోను 11 రోజుల్లోనే  1400 కోట్ల మధ్యం అమ్మకాలు జరిగాయి. ఈ అక్టోబర్ నెల ముగిసేలోగా సుమారు 3 వేల కోట్లకు పైగానే మద్యం అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్ శాఖ  అధికారులు అంచనా _వేస్తున్నారు. గత ఏడాది 2020 అక్టోబర్ నెలలో 2,623 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. లిక్కర్ 31 లక్షల 67 వేల కేసులు, బీర్లు 26 లక్షల 93 వేల కేసుల అమ్మకాలు జరిగాయి. మద్యం అమ్మకాలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో ఈ అక్టోబరు నెలలో మద్యం అమ్మకాలు 3వేల కోట్లకు పైగా జరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. మద్యం వల్ల ఆదాయం సగటు 39శాతం మేర పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు…!!

* ఖమ్మం జిల్లా కల్లూరు పుల్లయ్య బంజర్ రోడ్ నందు పట్టణ ఆర్యవైశ్య సంఘము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రుల ప్రత్యేక పూజా కార్యక్రమం అత్యంత వైభోవంగా జరిగాయి.భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.గత 5 సంవత్సరంలుగా అందరం కలిసి సంతోషంగా జరుపుకొంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా సభ్యులు పసుమర్తి చందర్ రావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.భక్తులకు తను స్వయంగా అన్నప్రసాద్ అందించారు.ఈ కార్యక్రమం లో ఆర్యవైశ్య సంఘం నాయకులు, చండ్రుపట్ల ఎంపిటిసి కుక్కా నాగమ్మ,వేముల శ్రీనివాసరావు,సముద్రాల పుల్లారావు ,మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

* విద్యుత్ కోతలపై వస్తున్నా అసత్య ప్రచారాలను నమ్మవద్దు: సీఎం డి హరి నాథ్ రావు

* మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (ంఆఆ) అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ( ంఅంచు విష్ను ) శ‌నివారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. మంచు విష్ణు, ఆయ‌న ప్యానెల్ స‌భ్యుల‌ చేత మా ఎన్నిక‌ల అధికారి కృష్ణ మోహ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో నిర్వ‌హించిన‌ ఈ వేడుక‌కు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మోహ‌న్ బాబు, న‌రేశ్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ప్ర‌మాణ‌స్వీకారం చేసిన అనంత‌రం మంచు విష్ణు, మోహ‌న్ బాబు ఆశీస్సులు తీసుకున్నారు. అయితే విష్ణు ప్యానెల్ నుంచి గెలుపొందిన ర‌ఘుబాబు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు. విష్ణు ప్యానెల్ నుంచి ర‌ఘు బాబు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా గెలుపొందారు.

* రాష్ట్రవ్యాప్తంగా శనివారం వర్షాలు దంచికొట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నగరంలో అత్యధికంగా ఎల్బీనగర్‌లో 10.6 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అంబర్‌పేటలో 10.4, ఉప్పల్‌లో 10.2, షాబాద్‌లో 9.6, సింగపూర్‌ టౌన్‌షిప్‌లో 9.1, హిమాయత్‌నగర్‌లో 8.1, మలక్‌పేటలో 7.2, చర్లపల్లిలో 7.8, నాచారంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా కందువాడలో 8.7, కందువాడలో 8.7, ఆరుట్లలో 7, సూర్యాపేట జిల్లా నాగారంలో 9.5, మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో 8.9, జడ్చర్లలో 8 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయింది.

* ఈ మధ్య కాలంలో క్రిప్టో కరెన్సీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీని అధికారికం చేయగా.. చాలా దేశాల్లో వీటిని కొనుగోలు చేయడం చట్టరిత్యా నేరమే. భారత్‌లోనూ 2018లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అత్యున్నత న్యాయస్థానం ఆర్‌బీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. మరోవైపు దేశంలో క్రిప్టో కరెన్సీని ఆమోదించేందుకు కేంద్రం ‘క్రిప్టో కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫిషియల్‌ డిజిటల్‌ కరెన్సీ’ బిల్లును సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో వీటి వినియోగం ఊపందుకుంది. ఎంతలా అంటే.. క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయడంలో ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానంలో నిలబడేంత.

* ఈటీవీలో ‘ఢీ’ మాదిరిగానే తమిళంలో ‘డ్యాన్స్‌ వర్సెస్‌ డ్యాన్స్‌’ పేరుతో నిర్వహించే డ్యాన్స్‌ రియాలీటీ షో ఎంతో గుర్తింపు పొందింది. ఇప్పటికే మొదటి సీజన్‌ పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం రెండో సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఖుష్బూతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బృందా మాస్టర్‌ దీనికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఖుష్బూ తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘సుందర్‌తో పెళ్లైనప్పటి నుంచి నేను 20 కిలోల బరువు పెరిగాను. దీంతో చాలా బొద్దుగా మారిపోయాను. లాక్‌డౌన్‌లో సినిమా షూటింగులు లేకపోవడంతో ఖాళీ సమయం దొరికింది. దీంతో అదనపు బరువును కరిగించుకుందామని గట్టిగా నిర్ణయించుకున్నాను. అయితే అది అంత సులభం కాదని, అలాగనీ అసాధ్యమూ కాదన్న విషయం నాకు తెలుసు. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌లో కొన్ని కఠినమైన డైట్ నియమాలు పాటించాను. నేను ఫుడ్‌ లవర్‌ని కాకపోయినా బిరియానీ, ఐస్‌క్రీంలు బాగా తింటాను. అయితే బరువు తగ్గడం కోసం వాటిని పూర్తిగా దూరం పెట్టాను. యోగాసనాలు చేశాను. క్రమం తప్పకుండా రోజూ 40 నిమిషాల పాటు వాకింగ్‌ చేశాను. అలా నేను అనుకున్న లక్ష్యానికి క్రమంగా చేరువవుతున్నా. ప్రస్తుతం నా పెళ్లి వేడుకల సమయంలో వేసుకున్న దుస్తుల్లో కూడా పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అవుతున్నా’ అని చెప్పుకొచ్చింది.

* ‘బొబ్బిలి సింహం’, ‘భైరవద్వీపం’ చిత్రాలతో నందమూరి బాలకృష్ణ, రోజా జోడీ అప్పట్లో సూపర్‌హిట్స్‌ అందుకున్నారు. ఆ రెండు సినిమాలు విడుదలై సుమారు 28 సంవత్సరాలైనప్పటికీ ఈ జోడీకి క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానుల ఆశ. ఈ క్రమంలోనే తాజాగా రోజా.. బాలకృష్ణకు ఫోన్‌ చేసి మాట్లాడారు. వీరిద్దరి సరదా సంభాషణకు ‘జబర్దస్త్‌’ వేదికైంది. రోజా, మనో న్యాయనిర్ణేతలుగా.. అనసూయ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో ‘జబర్దస్త్‌’. కమెడియన్ల ఆటో పంచులు.. న్యాయనిర్ణేతల కౌంటర్లతో ఈ షో తెలుగువారికి ఎంతో చేరువైన విషయం తెలిసిందే. తాజాగా వచ్చేవారానికి సంబంధించిన ఓ సరికొత్త ప్రోమో బయటకు వచ్చింది. దొరబాబు, పరదేశీ, శాంతిస్వరూప్‌లపై ఆది ఎప్పటిలాగే వరుస పంచులతో అలరించారు. ఇక, మద్యానికి బానిసైన భర్తగా రాఘవ నవ్వులు పూయించారు. ఇలా ఎంతో సరదాగా సాగుతోన్న ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ‘‘మేడమ్‌.. మా అందరి సమక్షంలో ఇప్పుడు మీరు బాలకృష్ణ సర్‌కు ఒక్కసారి కాల్‌ చేయాలి’’ అని అనసూయ కోరడంతో.. ‘‘మంచి మూడ్‌లో ఉంటే ఓకే. లేకపోతే..’’ అంటూ రోజా టెన్షన్‌ పడుతూ బాలయ్యకు ఫోన్‌ చేసి.. ‘‘హలో సర్‌.. బాగున్నారా?’’ అని అడగ్గా.. ‘‘రోజాగారు నమస్కారం. బాగున్నానమ్మా. మన అఖండ షూట్‌లో ఉన్నాను’’ అని ఆయన సమాధానమిచ్చారు. అనంతరం.. ‘‘మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దాం. ‘భైరవద్వీపం’ పార్ట్ 2నా? లేక ‘బొబ్బిలిసింహం’ పార్ట్‌ 2నా?అని అందరూ అడుగుతున్నారు?’’ అని రోజా అనడంతో.. ‘‘మన కాంబినేషన్‌ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు’’ అని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతేకాకుండా, ‘జబర్దస్త్‌’ జడ్జీగా తాను వస్తానని ఆయన అన్నారు. ఆయన మాటలతో ‘జబర్దస్త్‌’ సెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. అసలు బాలకృష్ణకు రోజా ఎందుకు ఫోన్‌ చేశారో తెలియాలంటే వచ్చే గురువారం వరకూ వేచి ఉండాల్సిందే. ఈలోపు ప్రోమో చూసేయండి!