పిజ్జా, చిప్స్, పేస్ట్రీ వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌ను చూడగానే తినేయాలనేపిస్తుంది కదూ! అయితే.. ఈసారి మాత్రం అవి తినాలంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే…. ఇప్పటి వరకూ ఈ హైలీ ప్రాసెస్ట్ ఫుడ్స్ తింటే బరువు పెరగడం, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనే తెలుసు. ఇప్పుడా జాబితాలోకి జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉన్నట్లు తాజా పరిశోధనలో తేలింది. బ్రెయిన్, బిహేవియర్, ఇమ్యూనిటీ జర్నల్ ప్రచురించిన అధ్యయనంలో.. హైలీ ప్రాసెస్ట్ ఫుడ్స్ (నిల్వపదార్థాలు, కొవ్వు శాతం, ఆర్టిఫిషియల్ రంగు, ఫ్లేవర్ ఉండేవి) తీసుకున్నట్లే అవి మెమొరీ లాస్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటిని నిరూపించే ప్రయత్నంలో భాగంగా పరిశోధకులు ఎలుకలకు ఈ హైలీ ప్రాసెస్ట్ ఫుడ్స్ అందించగా.. వారి మెదడుపై ప్రభావం చూపాయి. ఈ సందర్భంగా ఒహియో స్టేట్ యూనివర్సిటీ సీనియర్ పరిశోధకులు రూత్ బారింటోస్ మాట్లాడుతూ.. ‘‘ఈ పరిణామాలన్నీ మెదడుపై చాలా త్వరగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని వృద్ధులు తీసుకుంటే.. వారిలో ఆకస్మిక జ్ఞాపకశక్తి లోపంతో పాటు అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుందని కనుగొన్నాం. వీటన్నింటనీ దృష్టిలో పెట్టుకొని ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పరిమితంగా తీసుకొని ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ DHA అధికంగా తీసుకున్నట్లైతే ఆ సమస్యను నిరోధించవచ్చు’’ అని తెలిపారు.
పిజ్జా మరిచిపోండి. లేదంటే మతిమరుపు ఖాయం.
Related tags :