WorldWonders

డేరా బాబా పాపం పండింది

డేరా బాబా పాపం పండింది - Dera Baba Sentenced To Life With 31Lakhs Fine

డేరా బాబాకు జీవితఖైది మరియు 31 లక్షల జరిమానా.

చండీగఢ్‌:-డేరా సచ్చా సౌదా నిర్వాహకుడు , వివాదాస్పద మతగురువు గుర్మీత్‌ రామ్‌ రహీం బాబాకు సీబీఐ కోర్టు జీవితఖైది విధించింది.

2002లో హత్యకు గురైన డేరా సౌదా మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో డేరా బాబా సహా ఐదుగురికి ఈ జీవితఖైది ఖరారు చేసింది.

శిక్షతో పాటు డేరా బాబాకు రూ.31 లక్షలు, మిగతా నలుగురికి 50 వేల చొప్పున సీబీఐ కోర్టు జరిమానా విధించింది.

కాగా, ఇప్పటికే లైంగిక ఆరోపణల కేసులో డేరా బాబా శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.