NRI-NRT

తానా పుస్తక మహోద్యమం ప్రారంభం

తానా పుస్తక మహోద్యమం ప్రారంభం

తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన “పుస్తక మహోద్యమాన్ని”  తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అట్లాంటా నగరంలో గురువారం ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, భావితరాల వారికి పఠనాసక్తిని పెంపొందించేలా ప్రోత్సహించాలని కోరారు.

మీరు బహుకరిస్తున్నప్పుడు తీసిన ఫోటోలను, కొన్ని వివరాలను ఈ క్రింది లంకెలో పొందుపరచినట్లితే మీ ఫోటోలను తానా వెబ్సైటులో నిక్షిప్తం చేసి, తానా సంస్థ ద్వారా మీకు “పుస్తక నేస్తం” అనే ప్రశంసాపత్రం అందజేయబడుతుంది.  – https://bit.ly/TANAPUSTAKAMAHODHYAMAMREG