కోలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వివేక్.. ఈఏడాది ఏప్రిల్ 17న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే వివేక్ చనిపోవడంతో.. టీకా వికటించి ఆయన మృతి చెందారనే అనుమానాలు రేకెత్తాయి. దీంతో తమిళనాడులోని విజుపురానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త.. టీకా పొందడం వల్లే వివేక్ చనిపోయారా? అనే కోణంలో విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం.. తాజాగా ఈవిషయంపై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. వివేక్ చనిపోవడానికి రెండు రోజుల మందు టీకా తీసుకున్నారని… ఆపై సడెన్‌గా గుండెపోటు రావడంతో మృతిచెందారని తెలిపింది. ఆయన చనిపోవడానికి టీకాకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందని పేర్కొంది. ఈవిషయంపై అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కమిటీ (ఏఈఎఫ్‌ఐ) వివరణ ఇచ్చింది.
వివేక్ మరణానికి గల కారణాలు వెల్లడి
Related tags :