Business

రఘురామ లోన్ అవకతవకలపై RBI చర్యలు-వాణిజ్యం

రఘురామ లోన్ అవకతవకలపై RBI చర్యలు-వాణిజ్యం

* రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి రాసిన లేఖపై.. తగిన చర్యలు తీసుకుంటామంటూ ఆర్ బీఐ లేఖ.

* జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో అతిపెద్ద వాటాదారు ఇన్‌వెస్కో తీరును జీ ఎండీ కం సీఈవో పునీత్ గోయెంకా త‌ప్పుబ‌ట్టారు. భార‌త్‌లోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థలో త‌మ సంస్థను విలీనం చేయాల‌ని ఇన్‌వెస్కో చేసిన ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించాన‌న్నారు. అందుకు త‌న‌కు గుణ‌పాఠం నేర్పాల‌ని, జీ బోర్డు నుంచి తొల‌గించాల‌ని ఇన్‌వెస్కో ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని పునీత్ గోయెంకా ఆరోపించారు. ఈ మేర‌కు నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్ (ఎన్సీఎల్టీ) ముందు 25 పేజీల అఫిడ‌విట్ స‌మ‌ర్పించారు. జీ ఎంట‌ర్‌టైన్మెంట్ బోర్డు పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ ద్వారా కంపెనీపై పెత్త‌నం చేయాల‌ని ఇన్‌వెస్కో ఆలోచిస్తోంద‌ని ఆరోపించారు. ప్ర‌స్తుత యాజ‌మాన్యాన్ని గంద‌ర‌గోళ‌ప‌రిచడంతోపాటు.. ఇప్ప‌టికే సోనీ పిక్చ‌ర్స్‌లో విలీనం చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా దెబ్బ‌తీయాల‌ని ఇన్‌వెస్కో తెలిపారు. జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బోర్డులో త‌న ఉద్వాస‌న‌తోపాటు ప‌లువురు స్వ‌తంత్ర డైరెక్ట‌ర్ల‌ను నియ‌మించాల‌ని ఆ సంస్థ కోరుతున్న‌ద‌ని పునీత్ గోయెంకా త‌న అఫిడ‌విట్‌లో వెల్ల‌డించారు.

* ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ నిక‌ర లాభం 30 శాతం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.5,511 కోట్ల నిక‌ర లాభం గ‌డించింది. గ‌తేడాది (2020-21) సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో రూ.4,251 కోట్ల నిక‌ర లాభం సంపాదించింది. ఇక నిక‌ర వ‌డ్డీ ఆదాయం 24.8 శాతం పెరిగి రూ.11,690 కోట్లకు చేరుకున్న‌ది. గ‌తేడాది వ‌డ్డీపై నిక‌ర ఆదాయం రూ.9,366 కోట్లు ల‌భించింది. నిక‌ర మొండి బ‌కాయిలు 12 శాతం త‌గ్గాయి. జూన్ త్రైమాసికం ముగిసే నాటికి నిక‌ర మొండి బ‌కాయిలు రూ.9,306 కోట్లు ఉన్నాయి. అవి సెప్టెంబ‌ర్ త్రైమాసికానికి రూ.8,161 కోట్ల‌కు ప‌డిపోయాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు నాటికి నిక‌ర మొండి బ‌కాయిలు1.16 శాతం నుంచి 0.99 శాతం త‌గ్గాయి.

* వ‌చ్చే ఏడాది మార్కెట్‌లోకి రానున్న 2022 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియ‌ర్‌, ఇంటీరియ‌ర్ డిజైన్ స్కెచ్‌ల‌ను కంపెనీ ఇండోనేషియా విభాగం విడుద‌ల చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ మోడ‌ల్స్‌లో ఒక‌టిగా నిలిచిన హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్ష‌న్ 2022 చివ‌రిలో భార‌త్ మార్కెట్‌లోకి రానుంది.

* కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్ పూరీకి నోరుజార‌డం అల‌వాటుగా మారింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం స‌బ‌బేన‌ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్ పూరీ స‌మ‌ర్థించుకున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వేళ లక్ష‌ల మంది పేద‌ల‌కు ఉచితంగా భోజ‌నం, వంట గ్యాస్ స‌ర‌ఫ‌రా చేయ‌డంతోపాటు ప్ర‌జ‌ల‌కు ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్ వేయ‌డానికి పెట్రోలియం ఉత్ప‌త్తుల‌పై విధిస్తున్న సుంకాలు చేయూత‌నిస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

* పెట్రోకెమికల్స్‌, రిటైల్‌, టెలికం వ్యాపారాల దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) విశ్లేషకుల అంచనాల్ని మించిన ఫలితాల్ని వెల్లడించింది. 2021 జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 43 శాతం వృద్ధితో రూ.13,680 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో లాభం రూ.9,567 కోట్లు. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో ఆర్జించిన రూ.12,273 కోట్లకంటే సెప్టెంబర్‌లో 11 శాతం పెరగడం గమనార్హం. కంపెనీ ఆదాయం సైతం 2020 సెప్టెంబర్‌ క్వార్టర్‌కంటే భారీగా 48 శాతం పెరిగి రూ.1,74,104కోట్లకు పెరిగింది. గతేడాది ఇదేకాలంలో ఇది రూ.1,16,195 కోట్లు. గతంలో ఏ త్రైమాసికంలో ఆర్జించని రీతిలో ఆదాయం, లాభాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. చమురు, పెట్రోకెమికల్స్‌ వ్యాపారాలతో పాటు రిటైల్‌, డిజిటల్‌ విభాగాలు గణనీయమైన వృద్ధి కనపర్చాయి. ముగిసిన త్రైమాసికంలో తమ వ్యాపారాలపై కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఏమీ పడలేదని శుక్రవారం ఆర్‌ఐఎల్‌ తెలిపింది.