ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. సహకార ఎన్నికలపై ఎట్టకేలకు జగన్ సర్కారులో కదలిక వచ్చింది. కరోనా సాకుతో సహకార ఎన్నికలు నిర్వహించడంలేదని దాఖలైన వ్యాజ్యంపై ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలకు సుముఖత తెలుపింది. కోర్టుకు కౌంటర్ దాఖలు చేయనున్నట్లు కూడా వెల్లడించింది. పీఏసీలకు త్రిసభ్య కమిటీలు, డీసీసీబీ, డీసీఎంఎ కు ఏడుగురు సభ్యులు, ఆప్కాబ్‌కు పర్సన్ ఇన్‌చార్జిని నియమించిన ప్రభుత్వం, వారి గడువు(2022 జనవరి 31తో) ముగిసేలోగా ఎన్నికలు జరపడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. డిసెంబరు మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ, జనవరిలో ఎన్నికలు జరపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికల నగరా!
Related tags :