సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తనని వరించడం పట్ల అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం దిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో రజనీకాంత్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చెన్నైలోని తన నివాసం వద్ద రజనీ మీడియాతో మాట్లాడారు. ‘‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆ అవార్డు నాకు వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. ఈ సమయంలో నా గురువు కె.బాలచందర్ మన మధ్య లేకపోవడం నాకెంతో బాధగా ఉంది’’ అని రజనీ తెలిపారు.
అవార్డు సందర్భంగా బాధపడుతున్న రజనీ
Related tags :