NRI-NRT

ఆరుగురు గుంటూరు విద్యార్థులకు పొట్లూరి రవి చేయూత

ఆరుగురు గుంటూరు విద్యార్థులకు పొట్లూరి రవి చేయూత

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నర్సింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థినులకు, ఇద్దరు స్కూలు విద్యార్థులకు తానా మాజీ కార్యదర్శి, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి-హెల్ప్2సి సంస్థలు నిర్మల హృదయసేవాలో లక్ష రూపాయల ఆర్థిక చేయూత అందజేశారు. తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న చేయూత కార్యక్రమంలో భాగంగా నర్సింగ్ విద్యార్థినులు నిర్మల, రోజ్ మేరీ, లక్ష్మీ దేవి, కోటేశ్వరిలు నిర్మల హృదయ సంస్థ ద్వారా స్వతంత్రంగా అవరోధాలు అధిగమించి నర్సింగ్ విద్యను అభ్యసించడం ఆదర్శప్రాయమని, భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని పొట్లూరి రవి తెలిపారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో హైస్కూల్లో చదువుకుంటూ హెల్ప్ 2 సి సంస్థ ద్వారా అనాథ విద్యార్థులకు, వృద్దులకు సహాయం అందిస్తున్న అపర్ణ వాగ్వాల సేవలను కొనియాడారు. మాచర్లకు చెందిన విద్యార్థులు లోకాదిత్య, నిఖిల్ లకు పదివేల చొప్పున పారితోషికం అందించారు. కార్పొరేటర్ బాలాజీ నూకవరపు, పారిశ్రామికవేత్త ముప్పా రాజశేఖర్, సురేష్, వెంకటేశ్వర రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.