* మాల్దీవ్స్ లో టీడీపీ నేత పట్టాభి.హైదరాబాద్ నుంచి మాల్దీవ్స్ చేరుకున్న పట్టాభి.మాల్దీవ్స్ లో ఎక్కడఉన్నారనే దానిపై జోరుగా చర్చ.సీఎం జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలు నుంచి విడుదలయిన పట్టాభి.
* మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో వివాహితపై వాలంటరీ దాష్టీకం.ఒంటరిగా ఉన్న బాలింతను కామవాంఛ తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించిన వాలంటర్.ఇంట్లోకి ప్రవేశించి బలవంతం చేయబోవడంతో బయటకు పరుగులు తీసిన మహిళ.ఎవరికైనా చెప్పినా ఊళ్ళో తిరిగేది లేదంటూ వాలంటీర్ బెదిరింపులు.పోలీసులను ఆశ్రయించిన బాధితులురాలు.వాలంటీర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
* మచిలీపట్నం డివిజన్ పరిధిలోని గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో ప్రభుత్వం నిర్వహించిన బ్రాందీ షాప్ లో వరుస దొంగతనాలు..గూడూరు మండలం మల్లవోలు బ్రాందీ షాప్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న మనోజ్ గోపి అభిరామ్ కలిసి వైన్ షాప్ రేకులు పగలగొట్టి 150000 రూపాయలు దొంగతనం చేస్తూ గ్రామస్తులు చూసి పట్టుకున్నారు. అందించిన సమాచారం మేరకుగూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగలను అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా ఇదే షాపులో 240000 దొంగతనం జరిగినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.బ్రాందీ షాప్ లో పని చేసే వర్కర్స్ తో షార్ట్ ఏజ్ వచ్చిందని చెప్పి 240000 వర్కర్స్ కట్టించారు.తెలుగుదేశం నాయకుడు కేసును మాఫీ చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం తెలియవచ్చింది.
* గన్నవరం మండలం దుర్గాపురం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు..ఒక మహిళ మృతి ముగ్గురు వ్యక్తులకు గాయాలు.
* పాఠశాలల్లో విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కీచక ఉపాధ్యాయుల భరతం పట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు.