Politics

ఇక ఇప్పుడు బోండా ఉమా వంతు…గుంటూరులో నాన్‌బెయిలబుల్ కేసు-నేరవార్తలు

ఇక ఇప్పుడు బోండా ఉమా వంతు…గుంటూరులో నాన్‌బెయిలబుల్ కేసు-నేరవార్తలు

* తెదేపా కార్యాలయం విధ్వంసం కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ సక్రు నాయక్‌పై దాడి కేసులో నిందితులకు 41ఏ నోటీసులు ఇవ్వాలని ఆసెక్షన్‌ ప్రకారం నోటీసులిచ్చి విచారణ జరిపాలని మంగళగిరి పోలీసులను హైకోర్టు ఆదేశించింది.వీఆర్వో ఫిర్యాదుపై నమోదైన కేసులోనూ 41ఏ నోటీసులు ఇవ్వాలని సూచించింది.తెనాలి శ్రవణ్‌, పోతినేని శ్రీనివాసరావుపై కులం పేరుతో దూషించారని కేసు నమోదు కాగా గంజి చిరంజీవి, మరో పది మంది రాస్తారోకో చేశారని వీఆర్వో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.వీటికి సంబంధించిన కేసుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

* తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు పై గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.ipc 153a, 294 b,  504 , 505,  506 సెక్షన్ల కింద క్రైమ్ నెంబర్ 676 గా కేసు నమోదైంది.మంగళగిరి లోని టిడిపి కేంద్ర కార్యాలయం పై వైసీపీ మూకల దాడిని నిరసిస్తూ చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షా శిబిరంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్  సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

* కృష్ణా జిల్లాలోని పుల్లూరు సమీపంలో భవానీపురం హోసింగ్ బోర్డుకు చెందిన డేవిడ్‌ను బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేసేందుకు యత్నిం. డేవిడ్‌ను శాంతినగర్ బుడమేరు కాలువలో పడేసిన దుండగులు.

* కూకట్ పల్లి కోర్టు లో నటి సమంతకు ఊరట…సమంత వ్యక్తి గత వివరాలను ఎవ్వరు ప్రసారం చేయడానికి వెళ్లెదన్న కూకట్ పల్లి కోర్టు..సమంత కూడా వ్యక్తి గత వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలన్న కూకట్ పల్లి..రెండు యూట్యూబ్ ఛానెల్స్, డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింక్స్ ను తొలగించాలి.